logo
నేరలు

15 ఏళ్లుగా పరారీలో ఉన్న 72 ఏళ్ల నిందితుడి అరెస్ట్

పోలీసుల కళ్లుగప్పి 15 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఓ వృద్ధ నేరస్థుడిని ఢిల్లీ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. దాదాపు 15 సంవత్సరాల కిందట నమోదైన ఒక భారీ వసూళ్ల కేసులో ప్రమేయం ఉండి, ఎప్పటికప్పుడు స్థావరాలను మారుస్తూ తప్పించుకుంటున్న 72 ఏళ్ల హరి సింగ్ షెకావత్‌ను ఢిల్లీ పోలీసులకు చెందిన స్పెషల్ సెల్ అధికారులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.

Continue Read
సాధారణ వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ప్రశ్నాపత్రం లీకేజీ పరీక్ష జరిగిన కొద్ది గంటల్లోనే రద్దు చేసిన అధికారులు

ఛáత్తీస్ గఢ్‌లోని ఇందిరాగాంధీ వ్యవసాయ విశ్వ విద్యా లయంలో ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలు రావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేగింది. ఈ విశ్వవిద్యా లయం పరిధిలో గురువారం నిర్వహించిన బీఎస్సీ అగ్రికల్చర్ సెమిస్టర్ పరీక్ష జరిగిన కొన్ని గంటల్లోనే అధికారులు దానిని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. దిగ్గజ నటి షావుకారు జానకి కన్నుమÖత

దక్షిణాది చిత్రసీమలో తీవ్ర విషాదం నెలకొంది. ఏడు దశాబ్దాల పాటు సినీ ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటి ‘షావుకారు’ జానకి (94) వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. 1950లో ఎన్టీఆర్ సరసన ‘షావుకారు’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె, ఆ చిత్ర విజయంతో ‘షావుకారు జానకి’గా గుర్తింపు పొందారు.

Continue Read
సాధారణ వార్తలు

చర్చనీయాంశంగా యూజీసీ నెట్ పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాల ప్రక్రియ

యూజీసీ నెట్ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపే ప్రక్రియ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతీ ప్రశ్నకు రూ.200 చొప్పున రుసుము నిర్ణయించడంపై అభ్య ర్థుల నుంచి తీవ్ర నిరసనలు, విమర్శలు వ్యక్తం అయ్యాయి.

Continue Read
సాధారణ వార్తలు

జర్నలిస్టు దాడికి పాల్పడిన నిందితుడుని అరెస్టు చేయాలంటూ నిరసన

పూసపాటిరేగకు చెందిన విశాలాంధ్ర విలేఖరి పి.గోవిందుపై దాడికి వ్యతిరేకంగా జర్నలిస్టులు నిరసన గళమెత్తారు. జర్నలిస్టుపై కర్రలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు గుడివాడ కృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని జర్నలిస్టు సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

చమోలీలో వీధికుక్కల విజృంభణ: ఆగస్టు 23 వరకు 10 స్కూళ్లు బంద్

ఉత్తరా ఖండ్‌లోని కొండ ప్రాంతమైన చమోలీ జిల్లాలో వీధికుక్కల విజృంభణ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా నారాయణ్‌బగడ్, నల్‌గావ్ ప్రాంతాల పరిధిలో కుక్కల దాడులు ఎక్కువ కావడంతో.. స్థానిక ప్రజలు తీవ్రంగా వణికిపోతున్నారు. విద్యార్థులు, పిల్లలు, వృద్ధులు కుక్కల దాడికి బలి కాకుండా ఉండేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లనీయడం లేదు. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు, జిల్లా అధికా రులు సైతం వారికి మద్దతు ఇచ్చారు. ముఖ్యంగా విద్యార్థుల ప్రాణ రక్షణే ధ్యేయంగా ఈ నెల 23వ తేదీ నుంచి మొత్తం 10 పాఠశాలలను మూసివేయాలని విద్యాశాఖ ఆ

Continue Read
సాధారణ వార్తలు

మాజీ మావోయిస్టు ఆజాద్ జైలు నుంచి విడుదల

మాజీ మావోయిస్టు అగ్రనేత దున్న కేశవరావు అలి యాస్ ఆజాద్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనపై 68 కేసులు నమోదుకాగా.. దాదాపు 15 ఏళ్ల పాటూ జైల్లోనే ఉన్నారు. వాస్తవానికి ఆజాద్ 2011లోనే పోలీసుల ఎదుట లొంగిపో యారు. కానీ 10 రోజులకే ఒడిశా పోలీసులు ఆయన్ను విచారణ పేరుతో అరెస్ట్ చేసి తీసు కెళ్లారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు.. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆయనపై నమోదైన కేసులపై స్పెషల్ కోర్టులో విచారణ జరగ్గా.. ఆయ న్ను నిర్దోషిగా తేలుస్తూ తీర్పు వచ్చింది.. దీంతో జైలు నుంచి విడుదలయ్యారు.

Continue Read
సాధారణ వార్తలు

రద్దయిన డిగ్రీ కళాశాల పునః ప్రారంభం

: కోట బొమ్మాళిలో గతంలో రద్దయిన డిగ్రీ కళాశాల మళ్లీ మంజూరైంది. గత 2014-19 టీడీపీ హయాంలో మంత్రి అచ్చెన్నాయుడు కృషి ఫలితంగా డిగ్రీ కళాశాల మంజూరైంది.

Continue Read