సీఎం చంద్రబాబుకు మేయర్, కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ ఘన స్వాగతం
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖ నగరానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఘనంగా స్వాగతం పలికారు. శుక్రవారం కోస్టల్ బ్యాటరీ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్‌తో కలిసి మేయర్ సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్ఛాలను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.