ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని
కఅభివృద్ధిని వికేంద్రీకరిస్తాం కమూడు రాజధానులపై మంత్రి నారా లోకేష్ క్లారిటీ
అక్షర కిరణం, (విశాఖపట్నం): అమరావతి, మూడు రాజధానులు.. ఏపీకి రాజధానిపై మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. విశాఖలో పర్యటించిన మంత్రి నారా లోకేష్.. ఏపీ రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒకే రాజధాని ఉంటుందని.. కాకపోతే అభివృద్ధిని మాత్రం వికేంద్రీకరణ చేస్తామని స్పష్టం చేశారు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పారు. విశాఖ కన్వెన్షన్‌లో ఐసీఏఐ నేషనల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న నారా లోకేష్.. రోజురోజుకూ పెరుగుతున్న టెక్నాలజీ, దాని వల్ల ఉన్న ఉద్యోగాలు పోవడం, కొత్త ఉద్యోగాలు రావడం గురించి మాట్లాడారు. పారిశ్రామిక విప్లవం వచ్చిన ప్రతీసారి.. ఉద్యోగాలు తగ్గుతాయని అందరూ అంటారని.. కానీ కొత్త ఉద్యోగాల సృష్టి పెరుగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం మనందరి ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఒక గొప్ప అవకాశంగా ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై దృష్టి సారించినట్లు మంత్రి వెల్లడిరచారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కాబోతుందని వివరించారు.