ప్రజా ఆరోగ్య విభాగాన్ని తనిఖీ చేసిన జీవీఎంసీ కమిషనర్
అక్షర కిరణం, (విశాఖపట్నం): జీవీఎంసీ అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు కార్యాలయ పనివేళల సమయానికి తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. బుధవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ప్రజా ఆరోగ్య విభాగాన్ని తనిఖీ చేశారు. జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగు లందరూ నిర్ణీత సమయానికి విధుల్లో ఉండాలని ఆదేశిం చారు. తదుపరి జీవీఎంసీ స్టాటిస్టికల్ ఆఫీసర్ పీడీవీ ప్రసాద రావు చాంబర్ లో బర్త్ అండ్ డెత్ వివరాలను, నమోదు ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. నగరంలో జీవీఎంసీలో ఎన్ని హాస్పిటల్స్ నమోదు కలిగి ఉన్నాయని ఆరా తీయగా 238 హాస్పిటల్ రిజిస్ట్రేషన్ అయ్యాయని స్టాటిస్టికల్ ఆఫీసర్ తెలియజేశారు. బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు ప్రస్తుతం ఎన్ని పెండిరగ్లో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు సంబంధిత అర్జీల మేరకు వెను వెంటనే జారీ చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నగరంలో జీవీఎంసీలో రిజిస్ట్రేషన్ అవ్వని బర్త్ అండ్ డెత్ నమోదులు జరిగే క్లినిక్ లు, ఆసుపత్రులు ఏమైనా ఉంటే సీఆర్ఎస్ పోర్టల్లో నమోదు అయ్యేలా చూడాలని ఆదేశించారు.
జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియలో నమోదు చేసే సంబంధిత అధికారులు, ఉద్యోగులు నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత సమయంలో దరఖాస్తు దారులకు జారీ చేసేలా ప్రత్యేక శ్రద్ధను కనపరచాలని ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ.ఎన్ .వి. నరేష్ కుమార్కు కమిషనర్ ఆదేశించారు.