జీవీఎంసీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడండి
కమేయర్ పీలా శ్రీనివాస రావు, కమిషనర్ కేతన్ గార్గ్
అక్షర కిరణం, (విశాఖపట్నం): జీవీఎంసీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ పట్టణ ప్రణాళిక అధికారులను ఆద ేశించారు. గురువారం ఆయన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ప్రభా కర్లతో కలిసి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో పట్టణ ప్రణాళిక అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగర మేయర్ మాట్లాడుతూ జీవీఎంసీ ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా కాపాడవలసిన బాధ్యత పట్టణ ప్రణాళిక అధికారులపై ఉందని తెలిపారు. జీవీఎంసీ పరిధిలో జోనల్ వారీగా ఎన్ని ఖాళీ స్థలాలు, పార్కులు ఉన్నాయని, వాటిలో ఆక్రమణకు గురైన స్థలాలు, కోర్టు కేసులు, తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసు కున్నారు. అన్ని జోన్లలో కలిపి 48 కోర్టు కేసులకు సంబంధిం చిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోర్టు కేసు లు ఉన్న స్థలాల డాక్యుమెంటేషన్ సరైన పద్ధతిలో కోర్టులో ప్రవేశ పెట్టడంతో ఆయా స్థలాలను మనం కాపాడుకోగలు గుతామన్నారు. జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ జీవీ ఎంసీ ఆస్తుల పరిరక్షణకు పట్టణ ప్రణాళిక అధికారులు కృషి చేయాలని, ఖాళీ స్థలాలు, పార్కులు ఆక్రమణ జరగకుండా కాపాడాలని, కోర్టు కేసులో ఉన్న స్థలాల వివరాలతోపాటు ఆక్రమణ జరిగిన ప్రాంతాల ఫొటోలు మేయర్‌తో కలిసి పరిశీలించామని తెలిపారు.
కార్యక్రమంలో సిటీ ప్లానర్లు మీనా కుమారి, ధనుంజయ రెడ్డి, డీసీపీలు హరిదాసు, రామ్మోహన్, ఏసీపీలు, టీపీివోలు ఇతర పట్టణ ప్రణాళిక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.