విజయనగరంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
అక్షర కిరణం, (విజయనగరం): విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున ఎత్తు బ్రిడ్జి వద్ద విజయనగరం నుండి విశాఖకు బియ్యం లోడు తో వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు లైన్ క్లియరెన్స్‌కు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు.