కంచరపాలెం ప్రభుత్వ ఐటీఐకు ఉత్తమ అవార్డు
అక్షర కిరణం, (విశాఖపట్నం): కంచరపాలెంలోని ప్రభుత్వ ఐటీఐకు ఉత్తమ పారిశ్రామిక శిక్షణ సంస్థగా గు ర్తింపు లభించింది. దక్షిణ భారతదేశంలోనే ప్రథమ స్థానం లో నిలిచింది. ఈనెల 22న మంగళవారం ఢల్లీిలో కేంద్ర మంత్రి నుంచి ఉపాధి, పారిశ్రామిక శిక్షణ శాఖ డైరెక్టర్ గణేష్కుమార్, అడిషనల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం, ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీకాంత్ అవార్డును స్వీకరించారు. ఈ విజయాని కి కారకులైన ఉన్నతాధికారులు, సహకరించిన సిబ్బందికి ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. ఐటీఐను మరింత ఉన్నతస్థానానికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.