తిరుమల శ్రీవారిని అక్టోబర్ నెలలో 22.77 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో వెల్లడిరచారు. భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల ద్వారా శ్రీవారికి హుండీకి రూ. 119.35 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. అంతేకాకుండా అక్టోబర్‌లో 1.23 కోట్ల లడ్డూల విక్రయం జరిగిందని పేర్కొన్నారు.
Continue Read
బిహార్ ఉప-ముఖ్యమంత్రి, బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హాకు చేదు అనుభవం ఎదురైంది. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న లఖిసరై నియోజకవర్గంలో పోలింగ్ సరళిని పరిశీలించడానికి వెళ్లిన డిప్యూటీ సీఎం విజయ్ కుమార్‌పై కొందరు రాళ్లు, చెప్పులు విసిరారు. అంతటితో ఆగకుండా, ‘ముర్దాబాద్’ నినాదాలు చేస్తూ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.
Continue Read
కోయంబత్తూరులో ఓ కళాశాల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేగింది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈక్రమంలోనే నిందితులకు కఠిన శిక్షలు వేయాలని ప్రజలంతా డిమాండ్ చేస్తుండగా.. అధికార డీఎంకే మిత్రపక్షానికి చెందిన ఎమ్మెల్యే ఈఆర్ ఈశ్వరన్ మాత్రం విచిత్రంగా స్పందించారు. అసలు రాత్రి పూట ఆ అత్యాచార బాధితురాలు బయటకు ఎందుకు వచ్చిందంటూ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
Continue Read
పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఉదయం 7.45 గంటలకు ఆంధ్ర ఒడిసా ఘాట్ రోడ్‌లో ప్రయాణికులతో విశాఖపట్నం నుంచి జైపూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు నుండి ఒక్కసారిగా పొగలతో కూడిన మంటలు రేగి బస్సు దగ్ధమైంది. ఆర్టీసీ డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేయడంతో అందులో ఉన్న ప్రయాణికులందరూ వెంటనే కిందకు దిగిపోయారు.
Continue Read
ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా భోగాపురం, ఆనందపురం, మధురవాడ, పెదగంట్యాడ, ప్రాంతాల్లోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
Continue Read
: లండన్ లో పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రముఖ బహుళజాతి సంస్థ రోల్స్ రాయిస్ గ్రూప్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.
Continue Read
హైదరాబాద్‌కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు మంగళవారం (నవంబర్ 4) తిరుమల శ్రీవారికి కానుక ఇచ్చారు. 22 కిలోల వెండితో చేసిన భారీ గంగాళా న్ని అందజేశారు. కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్న శ్రీనివాసులు రెడ్డి.. అనంతరం స్వామి వారికి రూ.30 లక్షలు విలువ చేసే వెండి గంగాళాన్ని విరాళంగా టీటీడీ అధికారులకు అందించారు.
Continue Read
ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీలకంగా మారనుంది. భోగాపురం విమానాశ్రయాన్ని వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు చేపడుతున్నారు. ఇప్పటికే భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు చాలా వరకూ పూర్తయ్యాయి. అయితే భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి మరో కీలక అప్ డేట్ వచ్చింది. విశాఖపట్నం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 60 కిలోమీటర్ల మేరకు ఏవియేషన్ టర్బైన్ ఇంధనం పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ బోర్డు నిర్ణయించింది.
Continue Read