అశోక్ గజపతి రాజుకు బీజేపీ నేత మూల వెంకట్రావు శుభాకాంక్షలు
అక్షర కిరణం, (మాధవధార): గోవా గవర్నర్గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతి రాజుకు భారతీయ జనతా పార్టీ బీసీ నేత, వికసితభారత్ 2047 విశాఖ జిల్లా కోకన్వీనర్ మూల వెంకట్రావు శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం ఉదయం విజయనగరం అశోక్ బంగ్లాలో అశోక్ గజపతిరాజును కలిసి శాలువాతో సత్కరించి పూలబొకే అందజేసి అభినందనలు తెలియజే శారు. ఈసందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ రాజకీ యాల్లో అవినీతి మరకలేని, నిజాయితీపరుడైన అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి రావడం ముదావహం అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎన్నో పదవులు అధిరోహించిన అశోక్ గజపతి ఆ పదవులకే వన్నె తెచ్చారని కొనియాడారు. నిజాయితీకి నిలువుటద్దం, అభివృద్ధి కాముకుడు, నిరంతర శ్రామికుడు అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా ఆ పదవిలో రాణించి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలని మూల వెంకట్రావు ఆకాంక్షించారు.