మొగులుపాడు ఒకటో అంగన్వాడీలో పీడీ శాంతిశ్రీ తనిఖీలు
అక్షరకిరణం (పలాస): అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు నాణ్యతతో కూడిన సేవలందించాలని శ్రీకాకుళం జిల్లా పీడీ బి.శాంతిశ్రీ అన్నారు. బుధవారం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో మొగులుపాడు ఒకటో అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుతున్న కాలానుగు ణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని క్షేత్ర స్థాయిలో అంగన్వాడీ సేవలు లబ్థిదారులకు చేరేవిధంగా సిబ్బంది కృషి చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో లబ్థిదా రుల వివరాలు విధిగా నమోదు చేయాలన్నారు. తల్లీబిడ్డల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది భాగస్వాములు కావాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అంగన్వాడీ టీచర్లు పూర్వ ప్రాథమిక విద్య, ఆరోగ్యలక్ష్మి అంగన్వాడీ కేంద్రాల్లో పెరటి తోటల పెంపకాలపై శ్రద్థ చూపించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాశీబుగ్గ ప్రాజెక్ట్ అధికారి కె.పార్వతి, సూపర్వైజర్లు పి.గంగమ్మ, యు.లత తదితరులు పాల్గొన్నారు.