అన్న క్యాంటీన్లో కమిషనర్ రామారావు తనిఖీలు
అక్షరకిరణం, (పలాస): పలాస-కాశీబుగ్గ పుర పాలక సంఘంలో కాశీబుగ్గ బస్టాండ్ వద్ద గల ‘అన్న క్యాంటీన్‌ను గురువారం మున్సిపల్ కమిషనర్ నడిపేన రామారావు తనిఖీ చేశారు. క్యాంటీన్ నిర్వహణ, పారిశుధ్యం, ఆహార నాణ్యతలను నిశితంగా పరిశీలించారు. వినియోగదారులతో క్యాంటీన్లో ఆహార పదార్థాల నాణ్యత, రుచుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్ కు విచ్చేసిన ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా నాణ్యమైన ఆహారాన్ని, సేవా భావంతో అందించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని సిబ్బందిని ఆదేశించారు.