అక్షర కిరణం (గోపాలపట్నం):
గోపాలపట్నం రైతుబజార్ ను RJDM సుధాకర్ గారు, RDDM శ్రీనివాస్ కిరణ్ గారు, సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ విశాఖపట్నం రవికుమార్ గారు, తనిఖీ చేశారు SASA నందు ఆదేశించిన కార్యక్రమాలు ఎలా జరుగుతున్నవి స్వయంగా పరిశీలించారు. రైతుబజార్ మొత్తం అత్యంత పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులందర్ని భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. రైతుబజార్లో ఉన్న వాటర్ ట్యాంక్ లను శుభ్రపరిచి బ్లీచింగ్ తో శుద్ధి చేయడం జరిగింది. RO ప్లాంట్ వద్ద పరిశుభ్రంగా చేయడమైనది. స్టాల్స్ నందు బూజు , రేకులపైన పేరుకుపోయిన చెట్ల ఆకులు క్లిన్ చేయడమైనది మరియు మరుగుదొడ్లు నందు బ్లీచింగ్, పినాయిల్ వేసి సుబ్రపరచడమైనది, రైతుబజార్ ఆవరణంలో ఎక్కడ నీరు నిలవకుండ చర్యలు తీసుకోవడం జరిగింది. మరియు రైతులందరితో సమవేసమై పాలిథిన్ కవర్ లు వాడకుండా మరియు తడిచెత్త - పొడి చెత్త వేరుచేసి వేరు వేరుగా ఏర్పాటు చేసిన చెత్త బుట్టలో ఎలా వేయాలో అవగాహన కల్పించడం జరిగినది. అనంతరం స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర ప్రతిజ్ఞ అందరితో చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్టేట్ అధికారి జి. ప్రసాద్, సహాయకులు శివ, శ్రీనాథ్, రైతులు పాల్గొన్నారు.