సుబ్బారావు పాణిగ్రహి సతీమణి సురేఖ పాణిగ్రహి కన్నుమూత
కసీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకుల సంతాపం
అక్షర కిరణం, (పలాస): శ్రీకాకుళం విప్లవ పోరాట యోధుడు సుబ్బారావు పాణిగ్రాహి జీవిత సహచరిణి సురేఖ పాణిగ్రహి గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు స్వగ్రామం బొడ్డపాడులో కన్నుమూశారు. ఆమెకు సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా కమిటీ విప్లవ జోహార్లు అర్పించింది. సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, సహాయ కార్యదర్శి వంకల మాధవరావు మాట్లాడుతూ పాణిగ్రహి ఉద్యమంలో ఉన్న కాలంలో పోలీసు వేధింపులు అనేకం ఎదుర్కొన్నారు పాణిగ్రహి అమరుడై 57 ఏళ్లు కావస్తున్న తన ప్రయాణం ఒంటరిగా తన బంధువైన నిరంజన్ వద్ద ఉంటూ కటిక పేదరికం అనుభవించారని తెలిపారు. విప్లవోద్యమంలో అనేకమంది తల్లులు భర్తలను బిడ్డలను త్యాగాలు చేసినప్పుడు ఎన్నో కష్టాలు పడ్డారని చెప్పారు. సురేఖ పాణిగ్రహి మరణంపై సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తుందని పేర్కొన్నారు. ఆమె మరణం విప్లవోద్యామానికి తీరని లోటని తెలిపారు.