logo
నేరలు

కరుడుకట్టిన బవేరియా గ్యాంగ్‌ సభ్యుడు అరెస్టు

కరుడుకట్టిన బవేరియా గ్యాంగ్‌ సభ్యుడుని అరెస్టు చేసినట్టు విశాఖపట్నం సిటీ పోలీసులు తెలిపారు. అతడిని అరెస్టు చేసి 9 చైన్‌ స్నాచింగ్‌ కేసులు, రెండు బైకు దొంగతనాలు కేసులు ఛేదించినట్టు విశాఖపట్నం సిటీ పోలీసులు తెలిపారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

ప్రతి పౌరుడికి రూ.2.5 లక్షలతో ఆరోగ్య బీమా దత్తి గ్రామం ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు

రాష్ట్రంలోని ప్రతీ పౌరుడికీ ఆరోగ్య బీమా కల్పించేలా రూ.2.5లక్షలతో ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజక వర్గం, దత్తి గ్రామం ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ పేదలకు రూ.25 లక్షల వరకూ వైద్యం చేయించుకునే భరోసా ఇస్తున్నాం అన్నారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

కరూర్‌ తొక్కిసలాటలో 41 మంది మృతితో విజయ్‌ సంచలన నిర్ణయం

తమిళనాడులోని కరూర్‌ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్‌ రాజకీయ భవిష్యత్తును తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన సంగతి తెలిసిందే. కరూర్‌ జిల్లాలో ఇటీవల నిర్వహించిన ర్యాలీలో మహిళలు, చిన్నారులు సహా 41 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో ప్రజలు చనిపోవడం తో టీవీకే పార్టీ కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా విజయ్‌ తన రాష్ట్రవ్యాప్త పర్యటనను 2 వారాల పాటు తాత్కా లికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Continue Read
సాధారణ వార్తలు

వాయుగుండంగా మారనున్న తీవ్ర అల్పపీడనం ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వచ్చే 12 గంటల్లో బలపడి అదే ప్రాంతంలో వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని పేర్కొంది.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

దుర్గాలమ్మ ఆలయానికి పొటెత్తిన భక్తులు    ఏర్పాట్లు పర్యవేక్షించిన ఈవో

దుర్గమ్మ మా కష్టాలు తీర్చి, మమ్మల్ని చల్లగా చూడమ్మా అంటూ పూర్ణ మార్కెట్‌ దగ్గర ఉన్న  శ్రీ దుర్గమ్మ ఆలయానికి భక్తులు బారులు తీరారు. నగరం నలుమూల ల నుంచి  భవాని మాలలు వేసుకున్న భక్తులు, అమ్మ వారి భక్తులు బుధవారం తెల్లవారు జాము నుంచే దర్శనం కోసం క్యూ లైన్‌లో బారులు తీరా రు.

Continue Read
సాధారణ వార్తలు

అలరించిన చిన్నారుల దుర్గమ్మ నృత్య ప్రదర్శనలు

దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా వైభవంగా నిర్వహిస్తు న్నారు. విశాఖపట్నం మహానగరం గాజువాకలో అతిపెద్ద సెలస్ట్‌ అపార్ట్మెంట్‌లో వందలాది మంది నివాసితుల మధ్య దుర్గమ్మ ప్రాశస్త్యాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపేలా చిన్నారుల నృత్య ప్రదర్శనలు అలరించాయి.

Continue Read
సాధారణ వార్తలు

సీఎం చంద్రబాబుకు మేయర్‌ పీలా ఘన స్వాగతం

విజయనగరం పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విశాఖపట్నం విమానాశ్రయంలో బుధవారం నగర మేయర్‌ పీలా శ్రీనివాసరావు ఘనంగా స్వాగతం పలికారు.

Continue Read
నేరలు

అరుణాచలంలో దారుణం ఏపీ యువతిపై తమిళనాడు పోలీసుల అత్యాచారం

తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతిపై తమిళనాడు పోలీస్‌ విభాగానికి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు.

Continue Read