జేఎన్టీయూజీవీ వీసీ సుబ్బారావుకి ఉత్తరాంధ్ర విద్యార్థి సేన సత్కారం
అక్షర కిరణం, (విజయనగరం): జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్‌గా నియమితులైన ఆచార్య వీవీ సుబ్బారావును ఆయన చాంబర్లో ఉత్తరాంధ్ర విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఉత్త రాంధ్ర విద్యార్థి సేన వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సుంకరి రమణమూర్తి విశ్వ విద్యాలయ పరిస్థితులను వీసీకి వివరిం చారు. 2007లో ఎక్స్టెన్షన్ సెంటర్‌గా ఏర్పడిన జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయం అనేక ఆటుపోట్లకు గురయిం దని, విద్యపరంగా పరిపాలనపరంగా ఇబ్బందులు ఎదుర్కొం దని తెలిపారు. గతంలో విశ్వవిద్యాలయంలో జరిగిన అనేక అవినీతి అక్రమాలపై ఉత్తరాంధ్ర విద్యార్థి సేన పోరాటం చేసిన విషయాలను గుర్తు చేశారు. ఉత్తరాంధ్రలో ఉన్న ఏకైక సాంకేతిక విశ్వవిద్యాలయం ఇదొక్కటేనని, దీనిని అభివృద్ధి చేయాలని కోరారు. నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తే ప్రతి విద్యార్థి ఉద్యోగస్తుడిగా ఎదుగుతారని, ఈ ప్రాంతం అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందన్నారు. రాజకీ యాలకతీతంగా విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి పథంలో నడి పించడానికి పూర్తిస్థాయి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. సమస్యలను విన్న వీసీ సుబ్బారావు స్పందిస్తూ విశ్వ విద్యాలయ ప్రతిష్టను పెంచేందుకు విద్య, పరిపాలన పరంగా అభివృద్ధి పరిచేందుకు తగిన చర్యలు తీసుకుంటా నని తెలిపారు. ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావడమే లక్ష్యంగా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావాడ సీతారాం, డాక్టర్ అల్లాడి వీరభద్ర రావు, డాక్టర్ దంతేశ్వర పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.