1 నుంచి కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు
కఉత్సవాలకు హాజరుకావాలంటూ ఎమ్మెల్యే వంశీకృష్ణకు ఆలయ ఈవో ఆహ్వానం
అక్షర కిరణం, (విశాఖపట్నం): కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో వచ్చే నెల నవంబర్‌లో జరిగే మార్గశిర మాస మహోత్సవాల సందర్భంగా నవంబర్ 1వ తేదీన రాట మహోత్సవం నిర్వహిస్తున్నట్టు ఆలయ అధికా రులు తెలిపారు. ఈ వేడుకకు హాజరుకావాలంటూ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌కు ఆలయ ఈవో శోభారాణి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా నవంబర్ ఒకటో తేదీన ఉదయం 10 గంటలకు ఈ వేడుక నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ మునుపెన్నడూ లేనివిధంగా అమ్మవారి మార్గశిర మాస మహోత్స వాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదములు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ ఆనందకుమార్, ఈఈ రమణ, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.