తుఫాన్ ప్రభావిత అంబేద్కర్ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
అక్షర కిరణం, (అమలాపురం): మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతమైన డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేశారు. ఆయనతోపాటు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఈ పరిశీలనకు వచ్చారు. సీఎం చంద్రబాబుకు తుఫాన్‌కు సంబంధించిన పరిస్థితులపై సమగ్రంగా వివరించారు. జిల్లా వ్యాప్తంగా పర్యటించి, తుఫాన్ ప్రభావాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. గాలులు, వర్షాల కారణంగా కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిన విషయాలను ముఖ్యమంత్రికి మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. రైతుల పంటల నష్టం, రహదారి రవాణా అంతరాయం, పల్లె ప్రాంతాల్లో గృహాల దెబ్బతిన్న పరిస్థితులను వివరించారు. విద్యుత్, రవాణా, తాగునీటి పునరుద్ధరణ పనులు వేగవంతంగా కొనసాగుతు న్నాయని, అవసరమైన అన్ని వనరులు సమకూర్చినట్లు అచ్చెన్నాయుడు వివరించారు. రైతులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగం సమగ్రంగా పని చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేశారు.