logo
banner image
సాధారణ వార్తలు

వైఎస్‌ జగన్‌ కృష్ణాజిల్లా పర్యటనలో అపశృతి

. పెనమలూరు నియోజకవర్గంలోని మొంథా తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలలో జగన్‌ పర్యటన చేపట్టారు. ఈ పర్యట నలో అపశ్రుతి చోటుచేసుకుంది. వైఎస్‌ జగన్‌ కాన్వాయి లో ప్రమాదం జరిగింది.

Continue Read
సాధారణ వార్తలు

కాశీబుగ్గలో తీవ్ర విషాదం కవిజయ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట క9 మంది మృతి

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాశీబుగ్గలో ఉన్న విజయవెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. 9 మంది భక్తులు చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

Continue Read
సాధారణ వార్తలు

ఆర్‌ఎస్‌ఎస్‌ను తక్షణం బ్యాన్‌ చేయాల్సిందే: సర్దార్‌ పటేల్‌ చేసింది అదే

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి ఆరెస్సెస్‌ను బ్యాన్‌ చేయాలంటూ డిమాండ్‌ చేశారు. దేశంలో ఎక్కువ గా శాంతి భద్రతల సమస్యలు తలెత్తడానికి భారతీయ జనతాపార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆరెస్సెస్‌) కారణమని ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో ఆరెస్సెస్‌ను నిషేధించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన గాంధీజీ హత్య తరువాత సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించిన విషయాన్ని గుర్తు చేశారు.

Continue Read
నేరలు

సినిమా ఆడిషన్‌ పేరుతో 17 మంది పిల్లలను కిడ్నాప్‌ చేసిన సైకో

మహారాష్ట్ర రాజధాని ముంబైలో గురువారం సంచలన ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పిల్లలను కిడ్నాప్‌ చేశాడు. సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని పేర్కొంటూ.. కొంత మంది పిల్లలను ఆడిషన్‌కు పిలిచాడు. అలా 17 మంది పిల్లలు రాగా.. వారిని బంధించాడు. పిల్లలను రెస్క్యూ చేస్తున్న సమయంలో.. ఎయిర్‌ గన్‌తో రోహిత్‌ ఆర్య.. పోలీసులపైకి కాల్పులు జరిపాడు. దీనికి ప్రతిగా.. పోలీసులు కూడా ఒక రౌండ్‌ కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు రోహిత్‌ ఆర్య మరణించాడు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

1 నుంచి కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు

కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో వచ్చే నెల నవంబర్‌లో జరిగే మార్గశిర మాస మహోత్సవాల  సందర్భంగా నవంబర్‌ 1వ తేదీన రాట మహోత్సవం నిర్వహిస్తున్నట్టు ఆలయ అధికా రులు తెలిపారు. ఈ వేడుకకు హాజరుకావాలంటూ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌కు ఆలయ ఈవో శోభారాణి ఆహ్వాన పత్రికను అందజేశారు.

Continue Read
సాధారణ వార్తలు

జేఎన్టీయూజీవీ వీసీ సుబ్బారావుకి ఉత్తరాంధ్ర విద్యార్థి సేన సత్కారం

జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయ వైస్‌-ఛాన్సలర్‌గా నియమితులైన  ఆచార్య వీవీ సుబ్బారావును ఆయన చాంబర్‌లో ఉత్తరాంధ్ర విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.

Continue Read
సాధారణ వార్తలు

తుఫాన్‌ ప్రభావిత అంబేద్కర్‌ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

మొంథా తుఫాన్‌ ప్రభావిత ప్రాంతమైన డాక్టర్‌ బీఆర్‌. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేశారు. ఆయనతోపాటు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఈ పరిశీలనకు వచ్చారు. సీఎం చంద్రబాబుకు తుఫాన్‌కు సంబంధించిన పరిస్థితులపై సమగ్రంగా వివరించారు. జిల్లా వ్యాప్తంగా పర్యటించి, తుఫాన్‌ ప్రభావాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.

Continue Read
సాధారణ వార్తలు

మొంథా తుఫాన్‌ నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష

మొంథా తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ముగించుకుని రాష్ట్ర సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. తుఫాన్‌ వల్ల వచ్చిన నష్టంపైనా, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైనా ఆర్టీజీఎస్‌ నుంచి అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

Continue Read