స్వచ్ఛ మున్సిపాలిటీస్ కేటగిరీలో జీవీఎంసీకి జిల్లాస్థాయి అవార్డు
అక్షర కిరణం, (విశాఖపట్నం): మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో నిర్వహించిన జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో జీవీఎంసీతోపాటు జీవీఎంసీ పరిది óలో స్వచ్ఛత, పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణకు విశేషంగా కృషి చేస్తున్న పలువురు వ్యక్తులు, సంస్థలు వివిధ కేటగిరీల్లో పుర స్కారాలు అందుకున్నారు. కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేక అధి కారి ఎం. అభిషిక్త్ కిశోర్, ఎంపీ ఎం.శ్రీభరత్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తదితర ప్రజాప్రతినిధులు అవార్డు లను ప్రదానం చేశారు. జిల్లా స్థాయిలో “స్వచ్ఛ మున్సిపాలిటీస” కేటగిరీలో జీవీఎంసీకి లభించిన అవార్డును జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి స్వీకరించారు. కలెక్టర్, జీవీ ఎంసీ ప్రత్యేక అధికారి ఎం.అభిషిక్త్ కిశోర్ అధ్యక్షతన జరి గిన ఈ కార్యక్రమానికి విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ పరిధిలో “స్వచ్ఛ SLఖీs” కేటగిరీలో కె.ఆర్.ఎం. కాలనీ SLఖీ, “బెస్ట్ స్వచ్ఛత ఎన్జీవోస” కేటగిరీలో గ్రీన్ క్లైమేట్ టీమ్, స్వంతన సేవా సమితి, పెందుర్తి టెర్రస్ గార్డెన్ సొసైటీ, “స్వచ్ఛ కాలనీస” కేటగిరీలో శ్రీ తిరుమల నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లాస్థాయి పురస్కారాలు అందుకు న్నాయి. ‘బెస్ట్ స్వచ్ఛత వారియర్స్ కేటగిరీలో జీవీఎంసీ నార్త్ జోన్కు చెందిన బంగారి ప్రసాద్, సౌత్ జోన్కు చెందిన బి. సాయి శంకర్రావు, గాజువాక జోన్కు చెందిన పి.సత్యవతి, ఈస్ట్ జోన్కు చెందిన జి.కోటేశ్వరి కలెక్టర్, ప్రజాప్రతినిధుల నుంచి పురస్కారాలు అందుకున్నారు. కార్యక్రమంలో ఏపీ ఆయిల్ అండ్ సీడ్స్ గ్రోవర్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్లు బి.రామిరెడ్డి, జె.నాగలక్ష్మి, జీవీఎంసీ అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, పీఎం సత్యవేణి, అధికారులు, అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.