ఎంవీపీ రైతు బజార్లో రాయితీపై ఉల్లి విక్రయాలు ప్రారంభం
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు శనివారం ఎంవీపీ కాలనీ రైతుబజార్లో ప్రభుత్వం రాయితీ పై అందిస్తున్న ఉల్లిపాయల కౌంటర్‌ను ప్రారంభించారు. ఈ కౌంటర్లో కిలో ఉల్లిపాయలు కిలో రూ.35కు విక్రయిస్తు న్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డీఎస్వో భాస్కరరావు, వ్యవసాయ, వాణిజ్య, మార్కెటింగ్ అధికారి కిషోర్, మాజీ కార్పొరేటర్ పొలరావు, పార్టీ నాయకులు కాళ్ల శంకర్, సత్తిబాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొల్లి శోభ, రైతుబజార్ ఎస్టేట్ అధికారి కె. వరహా లు, సహాయకులు కనకరాజు, రైతులు, రైతుబజార్ డ్వాక్రా మహిళలు, వినియోగదారులు పాల్గొన్నారు.