అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు టెండర్లు ఆహ్వానం
Åరూ.11,537 కోట్లతో ఆరు లైన్లుగా, ఐదు జిల్లాల మీదుగా
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. అమరా వతి ఓఆరఆర్ నిర్మాణానికి ఎన్‌హెచఏఐ టెండర్లు ఆహ్వానించింది. ఔటర్ రింగ్ రోడ్డును పీపీపీఏసీ (కేంద్రం, ప్రైవేట్ భాగస్వామ్యం అప్రైజల్ కమిటీ) అను మతితో పాటుగా సీసీఈఏ (కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ) అనుమతి రానుంది. ఈలోపు టెండర్ల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. అమరా వతి ఔటర్ రింగ్ రోడ్డును 189.93 కిలోమీటర్లు మేర ఆరు వరుసలుగా నిర్మించనున్నారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు, నారాకోడూరు నుంచి గుంటూరు శివా రు బుడంపాడు వరకు 5.2 కిలోమీటర్ల మేర నాలుగు వరుసలతో కనెక్ట్ చేసేలా స్పర్ రోడ్‌తో సహా మొత్తం 195.13 కిలోమీటర్లు నిర్మించనున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును నాలుగు ప్యాకేజీలుగా విభజించారు.. సివిల్ పనుల అంచనా వ్యయం రూ.11,537 కోట్లు.
ఈ నెల 2నుంచే టెండర్ల డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేసు కునేందుకు అవకాశం కల్పించారు. బిడ్లు దాఖలు చేసేం దుకు నవంబరు 18 ఉదయం 11 గంటల వరకు వరకు అవకాశం కల్పించారు. నవంబరు 19న టెండర్లు ఓపెన్ చేస్తారు. ఓఆరఆర్ను హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) కింద నాలుగు ప్యాకేజీలుగా మూడేళ్లలో పూర్తి చేయాలి. .ఢిల్లీలో ఉన్న ఎన్‌హెచఏఐ ప్రధాన కార్యాలయం ఈ టెండర్లను పర్యవేక్షిస్తుంది. కాంట్రాక్ట్ సంస్థ కోట్ చేసిన మొత్తంలో ప్రభుత్వం 40 శాతాన్ని నిర్మాణ సమయంలో దశల వారీగా చెల్లిస్తుంది. కాంట్రాక్ట్ సంస్థ మిగిలిన 60 శాతం నిధులను సొంత నిధులు కానీ, బ్యాంక్ రుణంతో కానీ సమకూర్చుకోవచ్చు. ఈ నిధుల్ని ప్రభుత్వం 10-15 ఏళ్లపాటు వడ్డీతో సహా చెల్లిస్తుంది.
ఈ ఔటర్ రింగ్ రోడ్డు అమరావతి, గుంటూరు, విజయ వాడ చుట్టూ ఉంటుంది. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని 23 మండలాల్లో 97 గ్రామాల మీదుగా వెళ్తుంది. ఓఆరఆర్పై గంటకు 100 కి.మీ. వేగం తో వాహనాలు పరుగులు పెట్టేలా డిజైన్ స్పీడ్ ఉంటుంది. ఆరు నేషనల్ హైవేలు, ఏడు స్టే హైవేలు, ఒక జిల్లా రహ దారిని క్రాస్ చేస్తుంది. మూడుచోట్ల సొరంగాలు, కృష్ణా నదిపై రెండు వంతెనలు నిర్మిస్తారు. అలాగే 20 పెద్ద, 95 చిన్న వంతెనలు నిర్మించనున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు అటు, ఇటు ఉన్న గ్రామాల ప్రజలు రాకపోకలు కొనసాగించేందుకు 105 అండర్‌పాస్‌లు నిర్మిస్తారు. 8 చోట్ల రోడ్ ఓవర్ బ్రిడ్జిలు రానున్నాయి. ఈ ఓఆరఆర్కు ఐదు జిల్లాల్లో కలిపి 3,251.41 హెక్టార్లు భూసేకరణ చేస్తుండగా.. ఇప్పటికే వీటి కోసం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.