సత్యాగ్రహ పోర్టల్ ప్రారంభించిన రాహుల్ గాంధీ
Åదేశవ్యాప్తంగా నిరసనలకు ఒకే వేదిక
అక్షర కిరణం, (ఢిల్లీ/జాతీయం): కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొత్త డిజిటల్ వేదిక ను మొదలుపెట్టారు. దేశవ్యాప్తంగా పలు సమస్యలపై ప్రజ లు, విద్యార్థులు, రైతులు, మహిళలు, దళితులు, ఆదివాసీ లు, ఇతర వర్గాలు చేపడుతున్న నిరసనలను ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో సత్యాగ్రహ పేరుతో ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అక్టోబర్ 2వ తేదీన మహాత్మా గాంధీ జయంతి తర్వాతి రోజున ఈ సత్యాగ్రహ డిజిటల్ వేదికను రాహుల్ గాంధీ ప్రారంభిం చడం గమనార్హం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు. అయితే చాలా సందర్భాల్లో ఆయా పోరాటాలు విడి విడిగా జరుగుతున్నాయన్నారు. ఇలాంటి ఉద్యమాలను ఒకే చోటికి తీసుకురావడమే సత్యాగ్రహ వేదిక ఉద్దేశమని తెలిపారు. ఈసత్యాగ్రహ పోర్టల్‌లో తమ నిరసనలు, ఉద్య మానికి సంబంధించిన వివరాలను ప్రజలు నమోదు చేసు కోవచ్చని రాహుల్ గాంధీ సూచించారు. ఉద్యమం ఏ అంశంపై జరుగుతోంది.. ఎవరు నిర్వహిస్తున్నారు వంటి వివరాలను నమోదు చేస్తే.. అవి డిజిటల్ మ్యాప్‌లో కనిపిం చేలా ఈసత్యాగ్రహ వేదికను రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ ప్లాట్ఫామ్లో 150కిపైగా వివరాలు నమో దైనట్లు తెలుస్తోంది. భూమి సమస్యలు, మహిళల హక్కు లు, దళితులు, ఓబీసీల హక్కులు, విద్య, పరీక్షలు వంటి అంశాలపై దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరుగు తున్నాయని రాహుల్ గాంధీ తెలిపారు.
ఇలాంటి ఉద్యమాలన్నింటినీ ఒకే మ్యాప్‌పైకి తీసుకువచ్చి.. ఒకే అంశంపై పోరాడుతున్న ఇతర వ్యక్తులు, సంఘాలతో వారిని అనుసంధానం చేయడమే లక్ష్యమని రాహుల్ గాంధీ వివరించారు. ‘మీరు కూడా ఏదైనా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే.. మీ కథను పంచుకోండి. మీ నిరసన ఈ మ్యాప్‌లో చోటు పొందుతుంది. మీలాంటి సమస్యపై ఎవరు పోరాడుతున్నారో కూడా తెలుసుకోవచ్చు’ అని రాహుల్ గాంధీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
దేశవ్యాప్తంగా సత్యాన్ని అణచివేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. వివిధ ప్రాంతాల్లో అనేక నిరసనలు జరుగు తున్నాయని.. వాటిని ఒకచోట చేర్చి సంబంధిత ఉద్యమ కారులతో కలిసి పనిచేయాలనేది తన ఉద్దేశమని వీడియో సందేశంలో రాహుల్ గాంధీ తెలిపారు. మహాత్మా గాంధీని ప్రస్తావిస్తూ.. సత్యమే మన గొప్ప ఆయుధమని, అయితే సత్యం పక్షాన ప్రజలంతా కలిసి నిలబడటం మరింత శక్తి వంతమైనదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తమ సమస్యల పై పోరాడుతున్న వారు ‘సత్యాగ్రహ’ వెబ్సైట్లో ఫారం నింపి తమ ఉద్యమాన్ని నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే అవసరమైన చోట పార్లమెంటులో, వీధుల్లో, లేఖల ద్వారా వారి తరఫున తన వంతు కృషి చేస్తానని రాహుల్ గాంధీ తెలిపారు. ప్రతిపక్ష నేతగా ప్రజలకు అండగా నిలవడం తన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సత్యాగ్రహ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ నిరసనల వివరాలను ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు.. ఒకే సమస్యపై పోరాడుతున్న ఉద్యమకారుల మధ్య అనుసం ధానం పెంచే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.