రైతు బజార్లలో కిల్లో ఉల్లిపాయలు రూ.35కే
Åకందిపప్పు, పామాయిల్‌పై రూ.10 డిస్కౌంట్
అక్షరకిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది.. ఉల్లిపాయల నుంచి నూనె వరకు నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు భారంగా మారడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉల్లి ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు కొనుగోలు చేయ లేని పరిస్థితులు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం త్వరలోనే రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కిలో ఉల్లిపాయలు రూ.35కే విక్రయించాలని ఏర్పాట్లు చేయనున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో నియంత్రించేం దుకు.. మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్‌లతో కూడి కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై చర్చించింది.
నిత్యావసర వస్తువుల ధరల నియంత్రించేందుకు తీసుకో వాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించారు. కేంద్రం (ఎన్సీసీఎఫ్) సహకారంతో ఉల్లిపాయలు కేజీ రూ.35కే అందించేలా ఏర్పాట్లు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. త్వరలోనే రైతు బజార్లలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి ఉల్లిపాయలు అమ్మకాలు ప్రారంభిస్తామ న్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 350కి పైగా ప్రత్యేక బియ్యం కౌంటర్ల ద్వారా తక్కువ ధరకే బియ్యాన్ని అంది స్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాదు ఉల్లిపాయ లతో పాటుగా పామాయిల్, కందిపప్పును మార్కెట్ ధరపై రూ.10 చొప్పున తగ్గించి విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. త్వరలోనే కందిపప్పు ధరపై నిర్ణయం తీసుకుంటామన్నారు.. వీలైనంత వరకు ప్రజలపై ధరల భారం తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసు కుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై త్వరలోనే ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారన్నారు.
కేబినెట్ సబ్ కమిటీ భేటీ వివరాలను మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజలకు తక్కువ ధరకే బియ్యం విక్రయిస్తున్నామని.. అలాగే ఉల్లిపాయలు, కందిపప్పు, పామా యిల్ ధరలను తక్షణమే నియంత్రించేందుకు అవసరమైన మార్కెట్ ఇంటర్వెన్షన్ చర్యలను వేగవంతం చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రణాళికా బద్ధంగా ఈ సరఫరాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, విని యోగదారులకు నాణ్యమైన నిత్యావసరాలను అందు బాటులోకి తెచ్చేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందిం చామన్నారరు. వినియోగదారులకు ఊరట కలిగిస్తూ కిలో ఉల్లిపాయలను రూ.35కే అందించాలని నిర్ణయించామని.. ఇందుకు సంబంధించి తగినంత స్టాక్ రాష్ట్రానికి కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కందిపప్పు ధరల నియంత్రణకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నుంచి 1.20 లక్షల మెట్రిక్ టన్నుల కందులను కేటాయించాలని విజ్ఞప్తి చేశామన్నారు అచ్చె న్నాయుడు. ఈకందులను సేకరించి, ప్రాసెసింగ్ చేయించి రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రజలకు సరసమైన ధరలకే కందిపప్పుగా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పామాయిల్ ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేసేందుకు కూడా చ్పు్పుీఖీ సమన్వయంతో పామాయిల్‌ను సేకరించి సబ్సిడీ ధరలకు ప్రజలకు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఇప్పటికే బియ్యం ధరల నియంత్రణకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 651 ప్రత్యేక కౌంటర్లు, రైతు బజార్ల ద్వారా సుమారు 10,163 క్వింటాళ్ల బియ్యాన్ని విక్రయించి దాదాపు లక్ష మందికి పైగా వినియోగదారులకు ప్రయో జనం చేకూర్చామన్నారు. ప్రజాదరణ పొందిన ఖచీవీ రకం బియ్యాన్ని నెల్లూరు జిల్లా రైస్ మిల్లర్ల నుంచి 10,000 మెట్రిక్ టన్నులు సేకరించి ప్రత్యేక కౌంటర్ల ద్వారా సరసమైన ధరకు విక్రయిం చనున్నామన్నారు. నిత్యావసరాల నిల్వలు, ధరలపై నిరంతర పర్యవేక్షణ ఉంచుతూ, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠినం గా వ్యవహరిస్తామన్నారు. పౌరసరఫరాలు, వ్యవసాయ, ఆర్థిక శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తూ ప్రతీ సామాన్య కుటుంబా నికి నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.