51 మందిపై బైండోవర్ కేసులు నమోదు
అక్షర కిరణం (సాలూరు): సాలూరు పట్టణంలో 51 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని సీఐ అప్పలనాయుడు తెలిపారు. వీరందరిని సాలూరు తహసీల్దార్ ఎన్వీ రమణ, ఏంఈఏం కోర్టు తహసీల్దార్ల వద్ద హాజరుపరిచి సత్ప్రవర్తనతో ఉండేలా ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. బైండో వర్ ఉత్తర్వులు ఉల్లంఘించి ప్రవర్తిస్తే వారిపై 2 లక్షలు జరిమానా విధిస్తూ, చట్టవిరుద్ధ పనులు చేసేవారిగా గుర్తుస్తూ తదుపరి చర్యలు తీసుకోంటామని హెచ్చరించినట్టు తెలిపారు. వీరంతా సాలూరు పరిధిలో సారా విక్రయాలు చేసేవారని, వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పాత కేసులలో గొడవలకు కారకులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిగా గుర్తించినట్టు తెలిపారు. ఈసందర్భంగా సీఐ అప్పలనాయుడు, సాలూరు తహసీల్దార్, ఎన్వీ రమణ 51 మందికి సూచనలు, హెచ్చరికలు జారీచేసినట్టు వివరించారు.