నేత్ర రోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న శంకర్ ఫౌండేషన్ ఆస్పత్రి
Å2న ఘనంగా ఆస్పత్రి వ్యవస్థాపక దినోత్సవం: ఆస్పత్రి డీజీఎం కె.బంగారు రాజు
అక్షర కిరణం, (విశాఖపట్నం): శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రిని ప్రారంభించిన దివంగత ఆత్మకూరి శంకరరావు 95వ జయంతి సందర్బంగా సెప్టెంబర్ 2వ తేదీన ఆసుపత్రి వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వ హించేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆస్పత్రి డీజీఎం కె బంగారు రాజు తెలిపారు. వ్యాపారవేత్త శంకరరావు ఉన్నత ఆశయంతో కంటి ఆసుపత్రిని ప్రారంభించి ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్‌లోని నేత్ర రోగుల జీవితాల్లో వెలుగు లు నింపుతున్నారని పేర్కొన్నారు. 1997లో సామాజిక బాధ్యతగా శంకరరావు, తన భార్య ఆత్మకూరి యశోద, దివంగత కె.పార్వతీ కుమార్, డీవీ సుబ్బారావు సహకారంతో సింహా చలంలోని ఒక రెండు పడకగదుల ఫ్లాట్‌లో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి, పబ్లిక్ ఛారి టబుల్ ట్రస్ట్ స్థాపించారని తెలిపారు. కేవలం ఇద్దరు వైద్యులు, 15 మంది ఉద్యోగులతో ఉచిత అవుట్ పేషెంట్ విభాగాన్ని ప్రారంభించా రని తెలిపారు. ఇంత ఘనత సాధించడానికి ఎంతగానో కృషి చేస్తున్న డాక్టర్లకు, ఉద్యోగుల కు, జిల్లా యంత్రాంగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సంస్థ మేనేజింగ్ ట్రస్టీ, సీఈవో ఆత్మకూరు కృష్ణకుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
2002లో అవుట్ పేషెంట్ కన్సల్టేషన్ రూ.20, 2008లో రూ.100, 2015 నుండి రూ.250 కు ప్రస్తుతం రూ.300 పెంచారని తెలిపారు.
గత 29 సంవత్సరాలుగా శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి నేత్ర రోగులకు మెరుగైన సేవ లు అందిస్తోందని తెలిపారు. శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి విశాఖపట్నంలోని నాయుడు తోటలో రెండెకరాల విశాలమైన స్థలంలో 200 పడకలతో ఐదు అంతస్తులలో అత్యాధునిక సౌకర్యాలు, ఎనిమిది ఆధునిక ఆపరేషన్ థియే టర్లు, అన్ని సబ్-స్పెషాలిటీలతో నడుస్తోంద న్నారు. 450 మందికి పైగా సిబ్బంది, సూపర్ స్పెషలిటీ వైద్యులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది నిరం తరం సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఆస్పత్రి లో రోజుకు సగటున 120 నుండి 150 వరకూ కంటి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారని తెలిపారు. జూన్ 17న అత్యధికంగా 201 కంటి శస్త్రచికిత్సలు చేసి ఒక రికార్డును నెలకొల్పింద న్నారు. తమ సంస్థ కాలేజ్ ఆఫ్ ఆప్టోమెట్రీని కూడా నిర్వహిస్తోందన్నారు. ఆసుపత్రి నిర్వహణ కు న్యాయవాది ఎం రాందాస్ నేతృత్వంలోని ట్రస్టీల బోర్డు మార్గనిర్దేశం చేస్తోందని తెలి పారు. మేనేజింగ్ ట్రస్టీ సీఈవో ఆసుపత్రి వ్యవస్థాపకులు శంకరరావు పెద్ద కుమారుడు ఆత్మకూరి కృష్ణకుమార్ ఆసుపత్రిని సమర్ధవం తంగా ముందుకు నడిపిస్తున్నారని ప్రశంసిం చారు. ట్రస్టీలు ప్రొఫెసర్ ఎ.ప్రసన్నకుమార్, ఎ.విజయకుమార్ల సమష్టి కృషితో ఆసుపత్రిని కొత్త శిఖరాలకు చేర్చారన్నారు. 2011లో, ఫౌండేషన్‌ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ అధికారిక శిక్షణ సంస్థగా గుర్తించారని తెలిపారు. భారత ప్రభుత్వం నేష నల్ మెడికల్ కౌన్సిల్‌తో సమానమైన హోదాను శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి ఇచ్చింద న్నారు. శంకర్ ఫౌండేషన్ డీఎన్బీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సెంటర్‌గా కూడా గుర్తింపు పొందిందని చెప్పారు. ఈ సంస్థ 30 మందికి పైగా నేషనల్ బోర్డ్ డిప్లొమేట్లకు శిక్షణ ఇచ్చిందని తెలిపారు. శంకర్ ఫౌండేషన్ ఉద్యోగ,ఆధారిత వృత్తిపరమైన కోర్సులను అందించే కాలేజ్ ఆఫ్ ఆప్టోమెట్రీని కూడా నిర్వహిస్తోందని డీజీఎం కె బంగారు రాజు తెలిపారు.