ఇస్రో చరిత్రలో మరో ఘనత
Åజీఎసఎల్వీ ఎఫ్ 17ప్రయోగం సక్సెస్ Åఅంతరిక్షంలో చేరిన అద్భుత కెమెరా
అక్షర కిరణం, (శ్రీహరి కోట/జాతీయం): భారత అంతరిక్ష చరిత్రలో మరో విజయం నమోదయ్యింది. భూమికి దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తు నుంచి నిరంతరం నిఘా ఉంచేలా రూపొందించిన ఈవోఎస్-05 ఉపగ్రహాన్ని శుక్రవారం విజయ వంతంగా శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ కేంద్రం నుంచి ప్రయోగిం చారు. ప్రయోగ కేంద్రం నుంచి బయలుదేరిన రాకెట్ సరిగ్గా 18 నిమిషాల్లో నిర్దేశిత కక్ష్యలోకి దీనిని చేర్చింది. ప్రపంచంలోనే అత్యుత్తమ రిజల్యూషన్ కెమెరా కలిగిన మొదటి ఉపగ్రహం ఇదేనని ఇస్రో తెలిపింది. భారత ఉప ఖండాన్ని కేవలం 10 నిమిషాల్లో ఫోటో తీయగలదు. భారత అంతరిక్ష చరిత్రలో మరో కలికితురాయి చేరింది. దేశీయ మొట్టమొదటి ఇమేజింగ్ శాటిలైట్ ఈఓఎస్-5ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా నింగిలోకి పంపింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శుక్రవారం తెల్లవారుజామున 2.55 గంటలకు ప్రయాణం ప్రారంభించిన జీఎసఎల్వీ 17 రాకెట్.. సరిగ్గా 18 నిమిషాల తర్వాత ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. మొత్తం 2,367 కిలోల బరువున్న ఈఓఎస్-05ను దాదాపు 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని సబ్-జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టింది.
ఉపగ్రహం పెరీజీ (భూమికి సమీప బిందువు) 170 కి.మీ, అపోజీ (దూరపు బిందువు) 28,934 కి.మీ కక్ష్యలోకి చేరుకుంది. 51.7 మీటర్ల ఎత్తు, 420.5 టన్నుల బరువున్న ఈ రాకెట్ ద్వారా చేపట్టిన ప్రతిష్ఠాత్మక జీఎసఎల్వీ సిరీస్‌లో ఇది 19వ ప్రయోగం కావడం విశేషం. సాధారణంగా భూ దిగువ కక్ష్య (లియో), సన్- సింక్రోనస్ ఆర్బిట్లలో ఉండే శాటిలైట్లు నిర్దేశిత ప్రాంతాన్ని పరిశీలించి ఫొటో తీయడానికి కొద్ది రోజుల నుంచి వారాలు పడుతుంది. కానీ ఈఓఎస్-05 మాత్రం భూస్థిర కక్ష్యలో ఉంటూ.. ఒకే ఫ్రేమ్‌లో దక్షిణాసియాను మొత్తం ఫొటో తీయగలదు. 10 నిమిషాలకు ఒకసారి భారత ఉపఖండం మొత్తాన్ని ఫోటోలు తీసి పంపగలదు.
దీనిలోని ఎంఎక్స్-వీఎనఆర్ పేలోడ్ 42 మీటర్ల (ఒక పిక్సెల్కు) స్పేషియల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. జియో కక్ష్యలో ఇంతటి అత్యుత్తమ రిజల్యూషన్ కెమెరా కలిగి ఉన్న ప్రపంచంలోనే తొలి ఉపగ్రహం ఇదే కావడం విశేషం. ప్రస్తుతం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వద్ద ఉన్న సామర్థ్యంతో పోలిస్తే.. దీని పిక్సెల్ సాంద్రత 567 రెట్లు మెరుగ్గా ఉండటం విశేషం. అత్యుత్తమ పాన్క్రోమాటిక్ (బ్లాక్ అండ్ వైట్) ఇమేజర్లను సైతం వెనక్కి నెట్టి అత్యంత స్పష్టమైన ఫోటోలను తీయగల సామర్థ్యం దీని సొంతం.
ప్రయోగం విజయవంతమైనట్టు ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి నారాయ ణన్ తెలిపారు. “అధునాతన భూ పరిశీలన, జియో-ఇమేజింగ్ ఉపగ్రహమైన జుOS-05ను GSLV-ఖీ17 వాహన నౌక నిర్దేశిత కక్ష్య లోకి అత్యంత ఖచ్చితత్వంతో విజయవంతంగా ప్రవేశపెట్టిందని ప్రకటించడానికి నేను చాలా సంతోషిస్తున్నాను” అని అన్నారు.
“ఇది భారతీయులు అందరికీ ఎంతో గర్వకారణమైన, సంతోషకరమైన క్షణం. GSLV తన 19వ మిషన్‌ను విజయవంతం గా పూర్తి చేసుకుంది. ఈ ప్రయోగం ద్వారా నియర్ రియల్ టైమ్ ఫోటోలను అందించగల ప్రత్యేక సామర్థ్యం ఉన్న జుOS-05 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపాం... GSLVతో ఇప్పటివరకు GTO లేదా సబ్-GTO కక్ష్యలోకి పంపిన అత్యంత బరువైన ఉపగ్రహం ఇదే. ప్రయోగం కొన్ని నిమిషాలు మాత్రమే జరుగుతుంది.. కానీ దాని వెనుక నెలలు, సంవత్సరాల కఠిన శ్రమ దాగి ఉంటుంది” అని ఆయన అన్నారు.
ఈ విజయంపై కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ.. భారత్ తన అంతరిక్ష సామర్థ్యాలను మరింత పెంచుకుంటూ, ప్రపంచ అంతరిక్ష శక్తిగా తన స్థానాన్ని బలపరుచుకుంటోందని ప్రశంసించారు. ‘జుOS-05 అనేది ఒక అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం. భూ స్థిర కక్ష్య నుంచి దృశ్య, ఇన్ఫ్రారెడ్, మల్టీస్పెక్రటల్, హైపర్స్పెక్రటల్ బ్యాండ్లలో నాణ్యమైన ఫోటోలను అందించగల భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఇది’ అని జితేంద్ర సింగ్ ‘ఎక్స’ (ట్విట్టర్) వేదికగా రాసుకొచ్చారు.