రూ.1.29 కోట్లతో సీసీ డ్రెయిన్ నిర్మాణానికి శంకుస్థాపన
అక్షర కిరణం, (మాధవధార): ఉత్తర నియోజక వర్గం 54వ వార్డు పరిధిలోని జ్యోతినగర్ నుంచి లక్ష్మీనగర్ వరకు రూ.1,29,10,000తో చేపట్టనున్న సీసీ డ్రెయిన్ నిర్మాణ అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన జరి గింది. ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యుడు పి.విష్ణు కుమార్ రాజు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్థానికంగా డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. సీసీ డ్రెయిన్ నిర్మాణం తో వర్షపు నీరు, మురుగునీటి పారుదల సమస్యలు తగ్గి స్థానికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమార్తె శ్యామల దీపిక, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.