పరిపాలనలో సీఎం చంద్రబాబు ఘోర వైఫల్యం
ఎంపీపీ ప్రమీల, వైసీపీ నేత సన్యాసినాయుడు
అక్షర కిరణం, (విజయనగరం/గుర్ల): పరిపాలనలో సీఎం చంద్రబాబు ఘోర వైఫల్యం చెందారని ఎంపీపీ పొట్నూరు ప్రమీల, వైసీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పొట్నూరు సన్యాసినాయుడు విమర్శించారు. శనివారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల సమయంలో అన్ని వర్గాలకు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు అమలు లో వాటిని విస్మరించారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఎరువుల అందించడంలో వైఫల్యం అయ్యిందన్నారు. ఎరువుల కోసం రైతులు పక్క జిల్లాలకు, పక్క మండలాలకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడిరదన్నారు. దళారులు ఆటోలతో గ్రామాలకు తీసుకువచ్చి అధిక ధరలకు అమ్ముతున్నారని వాపోయారు. 2019లో ముఖ్య మంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి బాధితులు చేపట్టిన వంద రోజులుల్లో 87 శాతం హామీలు అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. అప్పట్లో అన్ని రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు ఎరువులు పూర్తిస్థాయిలో ఉండేవని గుర్తు చేశారు. ఖరీఫ్ సీజన్ వచ్చిన రైతులకు రైతు భరోసా (అన్నదాత సుఖీభవ) పెట్టుబడి సాయం రైతులు ఖాతాలో జమ కాలేదన్నారు. ఎక్కడ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రజలు నిలదీస్తారోననే భయంతో రోజుకో దుష్రప్రచారంతో ప్రజల దృష్టి మళ్లించేం దుకు ప్రయత్నిస్తారని. దిజమెత్తారు