ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
Åవిజయనగరం, విశాఖ, అల్లూరి జిల్లాలకు రెడ్ అలర్ట్
అక్షర కిరణం, (విశాఖపట్నం): ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై వర్షా లు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే మూడు గంటలు పిడుగులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ పలు జిల్లాలకు శుక్రవారం సాయం త్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వచ్చే మూడు గంటలు ఉత్తరాంధ్ర జిల్లాలలో పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఎక్స్ వేదికగా ప్రకటిం చింది. ఇందులో భాగంగా విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.