హరియాణా, జమ్ము కశ్మీర్‌ల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
కపదేళ్ల తరువాత జమ్ము, కశ్మీర్లో ఎన్నికలు కమూడు దశల్లో పోలింగ్
అక్షర కిరణం, (ఢల్లీి/జాతీయం): రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) షెడ్యూల్ విడు దల చేసింది. ప్రధాని ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి.. జమ్మూ కశ్మీర్, హరి యాణా అసెంబ్లీల ఎన్నికల తేదీలను ప్రకటించారు. జమ్మూ కశ్మీర్లో 87 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. మూడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. తొలి విడత పోలింగ్ సెప్టెంబరు 18న రెండో విడత సెప్టెంబరు 25న, మూడో విడత అక్టోబరు 1న నిర్వహించనున్నారు. అక్టోబరు 4న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిరచనున్నారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. చివరిసారిగా 2014లో అక్కడ ఎన్నికలు జరిగాయి.
మొత్తం 90 శాసనసభ నియోజకవర్గాలున్న హరియాణా లో ఒకే విడతలో ఎన్నికలు జరగున్నాయి. అక్టోబరు 1న పోలింగ్ నిర్వహించి.. జమ్మూ కశ్మీర్‌తో పాటు ఫలితాలను విడుదల చేయనున్నారు. హరియాణా అసెంబ్లీకి నవంబరు 6తో గడువు ముగియనుంది. ఈనేపథ్యంలో ఆ గడువు లోగా ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తోంది. హరియాణా లో మొత్తం 2 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపింది. సెప్టెంబరు 5న ఎన్నికల నోటిఫి కేషన్ జారీచేసి అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. చివరి తేదీ సెప్టెంబరు 12 కాగా.. సెప్టెంబరు 16 ఉపసంహరణకు గడువుగా ప్రకటించారు.
కాగా, కశ్మీర్లో సెప్టెంబరు 30లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికల సంఘం జమ్మూ కశ్మీర్లో పర్యటించి.. భద్రత సహా ఏర్పాట్లును సమీక్షించింది.
ఇక, అమర్నాథ్ యాత్ర ముగిసిన మర్నాడు ఆగస్టు 20న ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో 87 లక్షల మంది ఓటర్లు ఉండగా.. వీరిలో కొత్త ఓటర్లు 3.70 లక్షల మంది. అత్యధిక సంఖ్యలో యువ ఓటర్లు ఉన్నారని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడిరచారు.
మార్పును కోరుకుంటోన్న కశ్మీర్ ప్రజలు.. కొత్త భవిష్యత్తును సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఇటీవల తాము ఆ రాష్ట్రంలో పర్యటించినప్పుడు.. త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరారని చెప్పారు. ‘ప్రజలు మార్పును కోరుకోవడమే కాకుండా ఆ మార్పులో భాగం కావాలని కూడా నిరూపిస్తున్నారు.. ఆశ, ప్రజాస్వామ్యం సంగ్రహావలోకనం ప్రజలు ఆలోచనను మార్చాలని కోరు కుంటున్నట్లు చూపిస్తుంది... వారు తమ విధిని తామే రాయాలనుకుంటున్నారు. ప్రజలు బుల్లెట్ల కంటే బ్యాలెట్లను ఎంచుకున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇది తేట తెల్లమయ్యింది.. పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారు లు తీరారు’ అని వ్యాఖ్యానించారు.