క్రీడలు జాతీయ సమైక్యతా భావానికి ప్రతీకలు
జగద్గురు పీఠం డైరెక్టర్ చింతలపాటి సత్యదేవ్
అక్షర కిరణం, (మాధవధార): క్రీడలు జాతీయ ‘‘సమైక్యతా భావాలకు ప్రతిబింబాల’’ని జగద్గురుపీఠం డైరెక్టర్ చింతలపాటి సత్యదేవ్ అన్నారు. జాతీయ, అంతర్జాతీ య స్థాయిలో పతకాలను సాధించిన వారిలో ఆర్థికపర మైన సహాయ, సహకారాలందించి, ప్రోత్సహించడమనేది ప్రభుత్వ, ప్రముఖ సంస్ధల బాధ్యత అని సత్యదేవ్ అన్నారు.
‘మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ -2024’’ పేరిట జాతీ యస్థాయిలో ముంబాయి, అయోధ్యలో అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని 7 స్వర్ణ , 10 రజిత , 4 కాంస్య మొత్తం 21 పతాకలను సాధించిన విజేతలకు ఒక్కొక్క రికి రెండు వేల రూపాయలు చొప్పున ‘‘మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య’’ ఆశీర్వచనంగా ‘‘జనకులం ఫౌండేషన్’’ తరఫున పారితోషికాన్ని సత్యదేవ్ అందించారు. మురళీ నగర్‌లోని వనితభవన్లో వెటర్న్ అథ్లెటిక్స్ అసోసి యేషన్, విశాఖపట్నం ఆదివారం నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా సత్యదేవ్ పాల్గొని ప్రసంగించారు. విశిష్ఠ అతిథులు వైశాఖి స్పోర్ట్స్ అధ్యక్షులు శనపల వరప్రసాద్, కార్యదర్శి సత్యనారాయణ రాజు మాట్లాడారు. ఇండియా మాస్టర్స్ అథ్లెటిక్స్ సెక్రటరీ జనరల్ మంగ వరప్రసాద్ అధ్యక్షత వహించిన సభలో గౌరవ అతిథులుగా జనకులం ఫౌండేషన్ ధర్మకర్త సీహెచ్.శ్రీనివాసరాజు, వనిత వాకర్స్ కార్యదర్శి జయ, యూనివర్సల్ యూత్ వాకర్స్ అధ్యక్షులు వంశీ చింతలపాటి తదితరులు సత్యదేవ్‌ను, డాక్టరేట్ పొందిన మంగ వరప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు. మలేషియాలో జరుగనున్న అంతర్జాతీయ క్షీడలలో పాల్గొనడానికి విశాఖ నుండి వెళుతున్న ఏడుగురు క్రీడాకారులకు వరప్రసాద్, సత్యదేవ్ స్పోర్ట్స్ కిట్స్ ను బహూ కరించారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎల్వీ కార్యదర్శి సభకు స్వాగతం పలుకగా కోశాధికారి ఎం.రామారావు వందన సమర్పణ చేశారు.