సమాజసేవే నా మార్గం అంటున్న జనసేన నాయకుడు సామల్ల ప్రసాదరావు
తలసేమియాతో బాధపడుతున్న బాలుడికి చికిత్సకోసం అండగా నిలిచిన వైనం
దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇచ్చి ఆదుకోవాలంటూ పిలుపు
అక్షర కిరణం, (ఇచ్ఛాపురం): మానవత్వమే మతం, సమాజసేవే నా మార్గం అంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్న ఇచ్చాపురం నియోజకవర్గం జనసేన నాయకుడు, రిటైర్డ్ డీఎస్పీ సామల్ల ప్రసాదరావు ఇప్పుడు తలసేమియాతో బాధపడుతున్న మదన్ అనే బాలుడికి అండగా నిలిచారు. నిరుపేద కుటుంబానికి చెందిన మదన్‌ను ఆదుకునేందుకు ఆయన తనదైన రీతిలో కృషి చేస్తున్నారు. గొట్టివానిపాలెం మత్స్యకార గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త హేమరాజ్ కుమారుడు మదన్ తలసేమియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న ప్రసాదరావు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. తలసేమియా బాధితుడైన మదన్‌ను ఆదుకునేందుకు వైద్య చికిత్స కోసం పెద్ద మొత్తం లో నగదు అవసరం కావడంతో ఆయన తన తల్లిదండ్రుల పేరుతో ఏర్పాటు చేసిన బోనమ్మ, రాములయ్య ట్రస్టు తరపున రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. దీనితో పాటు బాలుడి చికిత్స కోసం జనసైనికులతో కలసి విరాళా లు సేకరిస్తున్నారు. ఈసందర్భంగా రిటైర్డ్ డీఎస్పీ సామల్ల ప్రసాదరావు మాట్లాడుతూ తలసేమియా వ్యాధి నుంచి మదన్‌ను కాపాడేందుకు చాలా ఖరీదైన వైద్యం చేయాల్సి ఉందన్నారు. మదన్‌కు రోజుకు రూ.20 వేల విలువైన ఇంజెక్షన్లను 20 రోజులపాటు ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు. ఈమేరకు జనసైనికులు పలు ప్రాంతాల్లో పర్యటించి మదన్ చికిత్స కోసం లక్ష రూపాయల విరాళాన్ని సేకరించినట్టు తెలిపారు. అదేవిధంగా తన తల్లిదండ్రుల పేరుతో పెట్టిన శ్రీ బోనమ్మ రాములయ్య ట్రస్టు తరుపున పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేసినట్టు చెప్పారు. అదేవిధంగా జనసైనికులందరూ కలసి రూ.13 వేలు ఆర్థిక సాయం అందించినట్టు వివరించారు. టీడీపీ నాయకులు సీతారామమూర్తి ఆదుకుంటామని హామీ ఇచ్చారని తెలి పారు. మరింతమంది దాతలు ముందుకువచ్చి మదన్ చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించాలని సామళ్ల ప్రసాదరావు విజ్ఞాప్తి చేశారు. జనసేన అధ్యక్షుడు లక్ష్మీనారా యణ దీని కోసం ఒక గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. ఈ గ్రూప్ద్వారా కూటమి నాయకులు కూడా తమ శక్తి మేరకు విరాళాలిచ్చి మదన్ చికిత్సకు సహకరిం చాలని కోరారు. దయగల దాతలు స్పందించి మదన్ చికిత్స కోసం ఆర్థిక సహాయం చేయాలని ఆయన పిలుపుని చ్చారు. దాతలు 7036563818 నంబర్‌కు సంప్రదించి తమ విరాళాలు ఇవ్వవచ్చని ప్రసాదరావు సూచించారు.