తిరుమలలో భారీ వర్షం
విరిగిపడిన కొండచరియలు
అక్షర కిరణం, (తిరుమల): బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా అల్పపీడనం కొనసాగుతోంది. రేపు పుదుచ్చేరి, నెల్లూరు జిల్లాల్లో తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురు స్తోంది తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడిరది. జెసిబిల ద్వారా బండరాళ్లను తొలగిస్తున్నారు. రెండో ఘాట్ రోడ్డుపై టిటిడి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ముందస్తు చర్యలో భాగంగా పాపవినాశనం, శ్రీవారి పాదాల మార్గం మూసివేసారు. తిరుమల నుంచి వచ్చే వరద నీరు తిరుపతికి చేరే అవకాశం ఉండటంతో ముంపు బాధితు లను ఆదుకోవడానికి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
తిరుమలతోపాటు చిత్తూరు అంతా భారీ వర్షాలు కురుస్తు న్నాయి. నెల్లూరు సహా పలు జిల్లాల్లో పరిస్థితిపై అధికారు లతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఆకస్మిక వరదలపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.