విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన
అక్షరకిరణం, (పలాస): కేంద్రంలోని మోదీ నేతృత్వం లోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలు విడనాడి, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగంలోనే నడపాలని కార్మిక, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక, రైతు సంఘాల పిలుపుమేరకు కాశీబుగ్గ బస్టాండ్ వద్ద ఆయా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. వివిధ సంఘాల నాయ కులు ఎన్.గణపతి (సీఐటీయూ), సీహెచ్.వేణుగోపాల్ (ఏపీరైతు సంఘం), టి.అజయకుమార్, డి శ్రీనివాస్ (ఏఐ సీసీటీయూ), ఎం.రామారావు, టి.సన్యాసిరావు తదితరులు మాట్లాడారు. అనేక మంది త్యాగాలతో 33 వేల ఎకరాల భూమి సమాకూర్చి, 32 మంది బలిదానంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేశారన్నారు. కార్పొరేట్ల కనుసన్నలలో నడు స్తున్న మోదీ ఉక్కు పరిశ్రమ అమ్మేయడానికే నిర్ణయించ డం ఎవరి ప్రయోజనం కోసమో తేల్చాలని డిమాండ్ చేశా రు. విభజన చట్టం అమలు చేయకుండా ఏపీని మోసం చేసిన మోదీ రాష్ట్త్రానికే తలమాణికమైన ఈ పరిశ్రమను కూడా అమ్మేస్తామంటే ఏపీ ప్రజలు చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వంతపాడడం మానేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాడాలని హితవుపలికారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయ కులు పి.నాగేశ్వరరావు, ఎన్.ఢల్లేిశ్వరి, జి.వాసుదేవరావు, కె దుష్యంతు, టి.సింహాద్రి, బి.శశిరేఖ, స్వాతి, పుణ్యావతి, సాయమ్మ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.