తెలుగు సినిమా హీరోల తీరు మారాలి
ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఓబీసీ విభాగం మాజీ చైర్మన్ మూల వెంకట్రావు
అక్షర కిరణం, (విశాఖపట్నం): తెలుగు సినిమా హీరోలు తమిళ, మలయాళ హీరోలను చూసి చాలా నేర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, మాజీ ఓబీసీ విభాగం చైర్మన్ మూల వెంకటరావు అన్నారు. ఏ సామజిక మాధ్యమైన కావొచ్చు కానీ దానికి, సమాజా నికి మధ్య సజీవసంబంధం ఉండాలన్నారు. అప్పుడే అది కాలాలను తట్టుకొని నిలబడుతుందన్నారు. ప్రస్తుతం సినిమానే అత్యంత బలమైన సామజిక మాధ్యమం అని పేర్కొన్నారు. తాత్కాలికమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదాం అంటే కుదరదన్నారు. కొవిడ్ చాలా మార్పులు తెచ్చిందని ఓటీటీ పుణ్యమా అని ప్రపంచ సినిమా సగటు ప్రేక్షకుడి కనుపాపల మీద కదిలిందన్నారు. ఫిల్మ్ మేకర్స్ కూడా తమ పందా మార్చుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. మన తెలుగు సినిమా హీరోలు కొలిచి లెక్క వేసుకునే మీటర్ సినిమా వద్దే ఆగిపోయారన్నారు. గాలిలో పది సుమోలా స్థాయి నుంచి వంద సుమోలా స్థాయికి వచ్చామని, ఒక తల తెగిపడే స్థాయి నుంచి వంద తలలు తెగిపడే స్థాయి వరకు వచ్చామన్నారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ మంచి సందేశాత్మక సినిమాలు చేశారన్నారు. ఇప్పుడున్న సీనియర్ హీరోలు పరభాషా హీరోలను చూసైన వారి గౌరవం, తెలుగు ప్రజల గౌరవం కాపాడే సినిమాలు చెయాలని కోరారు. లేకపోతే పాత మలయాళి సినిమా లాంటివి చేసుకోని గడిపేయాలని ఏద్దేవా చేశారు. కనీసం పరువు కాపాడే సినిమాలు తీయాలని కోరారు. కాదని అదే వరుస ఫాలో అయితే అటు ప్రేక్షకులు తెలుగు సినిమా కాంటాక్ట్‌ను బ్లాక్ చేస్తాయన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ మంచి సందేశాత్మక చిత్రాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, మాజీ ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ మూల వెంకటరావు కోరారు.