అసలు మనకు ఏం కావాలి?
పవన్ కళ్యాణ్‌కు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్
అక్షర కిరణం, (హైదరాబాద్): తిరుపతి లడ్డు విసయంలో చెలరేగిన పవన్, ప్రకాష్‌రాజ్‌ల వివాదం నడుస్తూనే ఉంది. గురువారం ప్రకాశ్ రాజ్ పవన్‌పై గెలిచే ముందు ఒక అవతావరం.. గెలిచిన తరువాత ఇంకో అవతారం.. ఏంటీ అవాతారం.. ఎందుకు మనకీ అయోమయం.. ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్.. అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈట్వీట్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుండగా తాజాగా శుక్రవారం సైతం ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. మనకేం కావాలి.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి.. తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా..? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా.. పరిపాలనా సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించు కోవటమా? జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. అయితే, ఆయన ఈ రెండు పోస్టుల్లోనూ ఎవరి పేరును ప్రస్తావించలేదు.. దీంతో ఆయన ఎవరిని ఉద్దేశించి పోస్టు పెట్టారు? ఎందుకు పెట్టారు.. అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ పై పవన్ కల్యాణ్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రకాశ్ రాజ్ నాకు మంచి మిత్రుడు. రాజకీయంగా మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకరి పట్ల ఒకరికి ఎంతో గౌరవం ఉంది. తిరుపతి లడ్డూ విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దోషులకు శిక్షపడాలనే ఉద్దేశంతో నేను పోస్టు పెట్టా. కానీ ప్రకాశ్ రాజ్ ఢల్లీిలో మీ స్నేహితులంటూ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన పోస్టును నేను తప్పుగా ఏమీ అర్ధం చేసుకోలేదు.. నాకు ఆయన ఉద్దేశం అర్ధమైందని పవన్ అన్నారు.