3 వార్డులకే పోటీ చేస్తున్నాం
Åమనసు మార్చుకున్న జనసేన నాయకుడు
అక్షర కిరణం, (విశాఖపట్నం): ఏపీలో స్థానిక సంస్థ లకు సంబంధించి అధికార కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వస్తోంది. సీట్ల పంపకాలపై కూటమి పార్టీల నేతల చర్చించుకుని ఓ నిర్ణయానికి వస్తున్నారు. విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో కొన్ని డివిజన్లకు సంబం ధించి టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్లు సర్దుబాటు విష యంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. భీమిలి నియో జకవర్గం పరిధిలోని జీవీఎంసీ వార్డులకు సంబంధించి పొత్తులో భాగంగా తమకు తగినన్ని స్థానాలు కేటాయిం చాలని జనసేన పార్టీ ఇంఛార్జ్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు డాక్టర్ సందీప్ పంచకర్ల కోరారు. ఒకవేళ తాము కోరినన్ని వార్డులు ఇవ్వకపోతే భీమిలి నియో జకవర్గం పరిధిలోని 12 వార్డులకు గాను 8 వార్డుల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు.
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంత స్ఫూర్తితో భీమిలి నియోజకవర్గం నుంచి జీవీఎంసీ పరిధిలోని 12 వార్డులకు 8 వార్డుల్లో జనసైనికులు, వీర మహిళలు నామినేషన్లు దాఖలు చేసిన విషయాన్ని పంచకర్ల సందీప్ గుర్తు చేశారు. భీమిలి నియోజకవర్గంలో 28వేల క్రియా శీల సభ్యత్వాలతో చాలా బలంగా ఉందని చెప్పుకొచ్చారు. కూటమి సర్దుబాటులో కేవలం 1 లేదా 2 సీట్లు మాత్రమే కేటాయిస్తామంటే సరికాదని.. తామంతా జనసేన పార్టీ బీ-ఫారం ఇస్తే గ్లాసు గుర్తుపైన, లేదంటే ఇండిపెండెంట్లుగా పవన్ కళ్యాణ్ కటౌట్ పెట్టుకుని పోటీ చేస్తామన్నారు. అలాగే సేనాని పవన్ కళ్యాణ్ మాటే శాసనం అన్నారు. ఆ తర్వాత ఈ సీట్లు సర్దుబాటుపై చర్చించిన తర్వాత మనసు మార్చుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు.
విశాఖపట్నం జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి పొత్తు ధర్మంలో భాగంగా మొదటగా 12 వార్డులకు ఒక్క సీటు ఇస్తామన్నారని.. ఇప్పుడు మూడు సీట్లు కేటాయించారని ప్రకటించారు. ‘5వ వార్డు-చోడిపల్లి గాయత్రి-వాడబలిజ-ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంబీఏ గ్రాడ్యుయేట్. 7వ వార్డు-దేవర మహేశ్వరి ఔ/శీ దేవర శివ-యాదవ-టీ షాప్ నడిపిస్తూ కొనేళ్లగా భీమిలి నియోజకవర్గంలో అత్యధికంగా క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేసిన సాధక్. 11వ వార్డు శఖరి శ్రీనివాస్-తెలగ-భీమిలి నియోజకవర్గ 11వ వార్డ్ అధ్యక్షుడు, బీటెక్ గ్రాడ్యుయేట్, పార్టీ పిలుపు మేరకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొన నాయకుడు’ అంటూ మూడు డివిజన్లకు అభ్యర్థుల్ని ప్రకటించారు. కూటమి ధర్మం ప్రకారం.. తమకు రావాల్సిన స్థానాల్ని.. తమ హక్కుగా సాధించుకునే ధైర్యాన్ని, స్ఫూర్తిని తమకు ఇచ్చిన పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు.