ఏపీలో మోగిన స్థానిక ఎన్నికల నగారా
Åఈనెల 28న 10 నగర పంచాయతీలు 13 కార్పొరేషన్లు 77 మున్సిపాలిటీలకు ఎన్నికలు
Å30న ఫలితాల వెల్లడి Åబుధవారం నుంచే అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునేఠా ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలను నిర్వహిం చేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 10 నగర పంచాయతీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలకు అక్టోబర్ 28న ఎన్నికలు జరుగుతాయి. 30వ తేదీన ఫలితాలను వెల్లడిస్తారు. అక్టోబర18-10 మధ్య నామినేషన్లను స్వీకరిస్తారు. 19-20 తేదీల్లో నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు అక్టోబర్ 21 వరకు ఉంటుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బుధవారం నుంచే ‘ఎన్నికల కోడ’. అమలులోకి వస్తుందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఈనెల 28న ఎన్నికలు నిర్వహించి ఈనెల 30న ఫలితాలు వెల్లడించనున్నట్టు పేర్కొన్నారు. ఈనెల 18న నామినేషన్లు దాఖలుకు, ఈ నెల 19న నామినేషన్ల పరిశీలన ఉంటుం దని తెలిపారు. ఈ నెల 21న నామినేషన్ల ఉపసంహరణకు గడువు నిర్ణయించినట్టు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో నవంబర్ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించను న్నట్టు ప్రకటించారు. నవంబర్ 5న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ప్రటిస్తారు. కాగా 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. నవంబర్ 26న తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రక టించారు. నవంబర్ 29న 2వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు. డిసెంబర్ 2న 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. కాగా కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలకు జిల్లాలో పరిస్థితు లను బట్టి నామినేషన్ల స్వీకర ణకు అదనపు కేంద్రం అవస రమని భావిస్తే కలెక్టర్లు సిఫార్సు చేస్తారని.. అలాంటి ప్రతిపా దనలు వచ్చినప్పుడు పరిశీలిస్తామని ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్, మున్సి పల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని 20 రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమై కీలక విషయాలు మరోసారి గుర్తు చేశారు. నామినేషన్లు వేసేం దుకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసు కోవాలని కలెక్టర్లను ఆదేశిస్తామని చెప్పారు.