అసమ్మతి నేతలు పోటీ చేస్తే సస్పెన్షన్ తప్పదు
Åరెబెల్స్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు లాస్ట్ వార్నింగ్
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార కూటమిలో రెబల్ అభ్యర్థుల వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిం ది. పార్టీ నిర్ణయాన్ని కాదని స్వతంత్రంగా బరిలో నిలిచే అభ్యర్థులు వెంటనే నామినేషన్లు ఉపసంహరించుకోవాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మాట వినకుండా పోటీలో కొన సాగితే పార్టీపరంగా క్రమశిక్షణ చర్యలు తప్పవని.. అవసs Áమైతే సస్పెన్షన్ వేటు వేస్తామని హెచ్చరించారు. కూటమి అభ్యర్థుల విజయానికి అడ్డంకులు లేకుండా చూడాలని పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు.
స్థానిక ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, కూటమి పార్టీ ల మధ్య సమన్వయం వంటి అంశాలపై పార్టీ ముఖ్య నేÔ áలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్లు వేసిన వారితో మాట్లాడి.. పోటీ నుంచి తప్పుకునేలా చూడాలని సూచించారు. రెబల్ అభ్యర్థుల కారణంగా ఓట్లు చీలిపో కుండా.. కూటమి అభ్యర్థుల విజయావకాశాలకు ఇబ్బంది కలగకుండా నాయకులు చొరవ తీసుకోవాలని ఆదేశిం చారు. టీడీపీతోపాటు కూటమిలోని జనసేన, బీజేపీ అధికా రిక అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లోనూ పరస్పర అవగా హనతో వ్యవహరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో స్థానిక నాయకులు వివాదాలకు తావివ్వకుండా చూడాలని సూచించారు. 3 పార్టీల నాయకులు వేర్వేరుగా అభ్యర్థుల ను నిలబెట్టడం కంటే, కూటమి నిర్ణయించిన అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
స్థానిక ఎన్నికల్లోనూ ప్రజల మద్దతు పొందేందుకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు నేతలకు సూచించారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. ‘చెప్పాం.. చేస్తున్నాం’ అనే నినాదంతో ఇంటింటి ప్రచారం నిర్వహించి.. కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను అభ్యర్థులుగా ఎంపిక చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. స్థానిక సమస్యలపై అవగాహన, ప్రజలకు సేవ చేయాలనే తపన, ప్రజాదరణ ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని నేతలకు చెప్పారు. కూటమి అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. పార్టీ తరఫున పోటీ చేయాలని ఆశించినప్పటికీ టికెట్ దక్కని నాయకులు, కార్యకర్తలు నిరాశ చెందవద్దని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు.
అర్హత, అనుభవం, సేవా దృక్పథం ఉన్నవారికి భవిష్యత్తులో నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని భరోసా ఇచ్చారు. అయితే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి రెబల్‌గా పోటీలో కొనసాగడాన్ని మాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈహెచ్చరికతో అసంతృప్త నేతలను బుజ్జగించి, అధికారిక అభ్యర్థుల తరఫున పనిచేసేలా చేయడం టీడీపీ నాయకత్వానికి ముఖ్యమైన బాధ్యతగా మారింది. నామినేషన్ల ఉపసంహ రణ దశలో స్థానికంగా తలెత్తిన విభేదాలను పరిష్కరించి, కూటమి భాగస్వాముల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలని చంద్రబాబు నేతలకు సూచించారు.