ఐదు న్యాయస్థానాలకు ప్రభుత్వ న్యాయవాదిగా వాన కృష్ణచంద్ నియామకం
అక్షర కిరణం, (శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లాలో పలు న్యాయస్థానాలకు ప్రభుత్వ న్యాయవాదిగా సీనియర్ న్యాయవాది వాన కృష్ణచంద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేశారు. శ్రీకాకుళం కుటుంబ న్యాయ స్థానం ప్రభుత్వ న్యాయవాదిగా రెగ్యులర్ విధులు నిర్వహి స్తూ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు సోంపేట జిల్లా సెషన్స్ కోర్టు శ్రీకాకుళం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టు, ఆరవ ఎడిషినల్ సెషన్స్ కోర్టులకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కృష్ణ చంద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాలో ఒకేసారి ఐదు న్యాయ స్థానాలకు ప్రభుత్వం తరు పున న్యాయవాదిగా పనిచేసే అరుదైన అవకాశం కృష్ణ చంద్‌కు లభించడంపై శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియే షన్ ప్రతినిధులు వివిధ స్వచ్ఛంద సంస్థల నేతలు, ప్రజా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేసారు.