కార్తీపై వ్యాఖ్యలతో పవన్‌పై తమిళ తంబీల ఆగ్రహం
కవ్యక్తిత్వం దిగజార్చుకున్నారంటూ దేశవ్యాప్తంగా ట్రోల్స్, మీమ్స్
కఅదేసమయంలో చేయని తప్పుకు సారీ చెప్పిన కార్తీపై జాతీయ మీడియాలో ప్రశంసలు
అక్షర కిరణం, (చెన్నై/జాతీయం): తిరుపతి లడ్డూ వివాదం రోజురోజుకు హీటెక్కుతోంది. తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని, జంతువుల కొవ్వును నెయ్యిలో కలిపారని ఆరోపణలు వస్తున్న విషయం తెల్సిందే. ఈ వివాదంపై ఏపీ ప్రభుత్వం భగ్గుమంటుంది. ఇప్పటికే తిరుపతి లడ్డూ వివాదంపై సమగ్ర విచారణ జరపాలని సిట్‌కు ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.
అంతేకాకుండా ఈ వివాదం గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా పవన్ కళ్యాణ్ సీరియస్‌గా వార్నింగ్ ఇస్తున్నారు. నిన్నటికి నిన్న సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్లో తమిళ్ హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలపై కూడా పవన్ సీరియస్ అయ్యారు. ఆ ఈవెంట్లో లడ్డూ గురించి నార్మల్‌గా అడిగిన ఒక ప్రశ్నకు కార్తీ.. ఇప్పుడు లడ్డూ గురించి ఏం మాట్లాడొద్దు. అది చాలా సెన్సిటివ్ ఇష్యూ’’ అని అన్నాడు. ఇక కార్తీ మాటలపై పవన్ ఫైర్ అయ్యారు.
ఈ రోజు లడ్డూపై కామెంట్స్ చేస్తున్నారు. జోక్స్ వేస్తున్నారు. నిన్న ఓ సినిమా ఈవెంట్లో లడ్డూ అనేది సెన్సిటివ్ ఇష్యూ అని అన్నారు. దయచేసి అలా అనొద్దు. నటులుగా మీరంటే గౌరవం.. కానీ, సనాతన ధర్మం విషయం గురించి వచ్చినప్పుడు ఒక్కమాట మాట్లాడాలన్నా వందసార్లు ఆలోచించండి’’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ వ్యాఖ్యలపై కార్తీ కూడా రియాక్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ కు సారీ చెప్పాడు. ఇక్కడితో ఈ వివాదం ముగిసింది అనుకుంటే పొరపాటే.
ఇప్పుడు ఈ వివాదంలోకి తమిళ తంబీలు కూడా ఎంటర్ అయ్యారు. పవన్ కళ్యాణ్.. ఈ విషయంలో చాలా ఓవర్‌గా మాట్లాడారని అంటున్నారు. కార్తీ మాట్లాడిన దాంట్లో తప్పే లేదు. నవ్వుతూ లడ్డూ విషయంలో తనను అడగొద్దని చెప్పాడు. అది కొంతమంది వెటకారంగా చెప్పాడని చెప్పి కాంట్రవర్సీగా మార్చారని కోలీవుడ్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. చేయని తప్పుకు కార్తీ సారీ చెప్పాడు. దానివలన అతని వ్యక్తిత్వం మరింత పెరిగిందే కానీ, తగ్గలేదు. ఇక చిన్న విషయాన్నీ పెద్దది చేసి పవన్ తప్పు చేశాడని అని ఏకిపారేస్తున్నారు.
అసలు ఈ వివాదం గురించి తప్పుగా మాట్లాడినవారు.. వెటకారం చేసినవారు చాలామందే ఉన్నారు. వారందరిని వదిలేసి.. వేరే ఇండస్ట్రీ నుంచి తెలుగుకు వచ్చిన ఒక హీరోపై ఆ కోపం ప్రదర్శించడం తప్పని అంటున్నారు. కార్తీ విషయంలో కోలీవుడ్ మొత్తం ఒక్కటిగా నిలబడిరది.. పవన్‌పై విమర్శలు గుప్పిస్తూ మీమ్స్ వేయడం మొదలుపెడుతున్నారు.
తమిళ తంబీలు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది పవన్‌కు కచ్చితంగా నెగెటివిటీని పెంచుతోంది. ఏతప్పు చేయని వేరే ఇండస్ట్రీ హీరోపై అసహనం ప్రదర్శించి పవన్ తన వ్యక్తిత్వాన్ని మరింత కిందకు దిగజార్చుకున్నాడని తమిళ ప్రజలతోపాటు దేశవ్యాప్తంగా మీడియా ప్రముఖులు సైతం అంటున్నారు.