వార్డు సచివాలయాల్లో జోనల్ కమిషనర్ తనిఖీలు
అక్షర కిరణం, (వన్‌టౌన్): జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు దక్షిణ జోన్ జోనల్ కమిషనర్ ఎం. మల్లయ్య నాయుడు గురువారం పలు వార్డు సచివాల యాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా 1086198, 1086205 (వేలంపేట-2) సచివాలయా లను సందర్శించారు. అక్కడ నిర్వహిస్తున్న రికార్డులు, ఉద్యోగులు హాజరు రిజిస్టర్లు, విధుల కేటాయింపు వివరా లను పరిశీలించారు. వార్డు అడ్మిన్ సెక్రటరీల లాగిన్లలో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లు, ప్రజల నుంచి అందిన దరఖాస్తుల ప్రస్తుత స్థితిని సమీక్షించారు. ఆయన సిబ్బందితో మాట్లా డుతూ ప్రభుత్వ సేవల కోసం ప్రజలు సమర్పించే దరఖా స్తులను ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతిఒక్కరూ సమయ పాలన పాటిస్తూ సకాలంలో విధులకు హాజరుకావాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించినా, ఆలస్యంగా వచ్చినా సహిం చేది లేదని, అటువంటి వారిపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని జోనల్ కమిషనర్ హెచ్చరించారు.
దక్షిణ జోన్లో మÖడవ రోజు రెవెన్యూ ట్యాక్స్ మేళా
దక్షిణ జోన్లో గురువారం జోనల్ కమిషనర్ ఎం. మల్లయ్య నాయుడు ఆధ్వర్యంలో మÖడవ రోజు రెవెన్యూ ట్యాక్స్ మేళా నిర్వహించారు. జోన్ పరిధిలోని ప్రజల నుంచి వివిధ రెవెన్యూ సంబంధిత సమస్యలు, అభ్యర్థనలపై దరఖాస్తులు స్వీకరించారు. ప్రజలకు మరింత సౌకర్యం కల్పించేందుకు దక్షిణ జోన్ పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు సమర్పించాలని జోనల్ కమిషనర్ కోరారు. కార్యక్రమంలో దక్షిణ జోన్ రెవెన్యూ ఆఫీసర్ టీఎసఎన్. రాజు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు సీతారామ య్య, సురేష్, సంధ్య, పద్మ, సచివాలయ అడ్మిన్ సెక్రటరీలు పాల్గొన్నారు.