పురుష ఉద్యోగులకు 15 రోజుల పెటర్నిటీ లీవ్.. తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన
అక్షర కిరణం, (చెన్నై/జాతీయం): తమిళనాడులోని జోసెఫ్ విజయ్ ప్రభుత్వం పితృత్వ సెలవుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగు లకు 15 రోజులపాటు పెటర్నిటీ లీవ్‌లను ప్రకటించింది. తమిళనాడులో పితృత్వ సెలవులను ప్రకటించడం ఇదే తొలి సారి కావడం గమనార్హం. వివాహితులైన ప్రభుత్వ ఉద్యో గులు తమ భార్య ప్రసవానికి 15 రోజుల ముందు లేదా ప్రసవించిన ఆరు నెలలలోపు పెటర్నిటీ లీవ్‌ను పొందొచ్చని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.
ప్రసవ సమయం అనేది తల్లితోపాటు నవజాత శిశువుకు ఎంతో ముఖ్యమైందని విజయ్ సర్కారు పేర్కొంది. ఆ సమ యంలో భార్యకు మానసిక, శారీరక తోడ్పాటును అందించ డంతోపాటు బిడ్డ సంరక్షణలో సహాయపడటానికి భర్త తోడుగా ఉండటం ఎంతో అవసరమని అభిప్రాయపడింది.
తమిళనాడులో మహిళా ఉద్యోగులకు ఏడాదిపాటు ప్రసూతి సెలవులు ఇస్తున్నారు. దీంతో పురుష ఉద్యోగులు తమకు కూడా పితృత్వ సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు. వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న విజయ్ ప్రభుత్వం 15 రోజుల పెటర్నిటీ లీవ్‌ను ప్రకటించింది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవులు ఇస్తున్నారు. సిక్కింలో అత్యధికంగా 30 రోజులు పెటర్నిటీ లీవ్ ఇస్తుండగా.. హర్యానాలో 15 రోజులు, కేరళలో 10 రోజుల చొప్పున ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు పెటర్నిటీ లీవ్ సదుపాయాన్ని కల్పించ లేదు. ప్రయివేట్ సంస్థల్లో పని చేసే వారికి ఆయా కంపెనీ లను బట్టి ఐదు రోజుల నుంచి 15 రోజుల వరకు పితృత్వ సెలవులు ఇస్తున్నారు. కొన్ని మల్టీ నేషనల్ కంపెనీల్లో మాత్రం ఆయా హెచఆర్ పాలసీల ప్రకారం 4 వారాలు లేదా అంత కు మించి పెటర్నిటీ లీవ్ ఇస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో ప్రభుత్వ, ప్రయివేట్ అనే తేడా లేకుండా మహిళా ఉద్యోగులకు 26 వారాల ప్రసూతి సెల వులు ఇస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఈసెలవులను అమలు చేస్తున్నారు. అయితే తమిళనాడు, ఒడిశా, సిక్కిం లాంటి రాష్ట్రాల్లో 12 నెలలు ప్రసూతి సెలవులు ఇస్తున్నారు.