దక్షిణ కోస్తా రైల్వేలో రాజ్యాంగ దినోత్సవం
అక్షర కిరణం, (విశాఖపట్నం): దక్షిణ కోస్తా రైల్వే ఆధ్వర్యం లో ఈనెల 26న గురువారం విశాఖపట్నం లోని ప్రధాన కార్యాలయమైన వీఎంఆర్డీఏ ది డెక్‌లో భారత రాజ్యాంగ పీఠికను సామూహికంగా పఠించి రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) ఘనంగా నిర్వహించారు. దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఎల్వీవీఎస్.పాత్రుడు ఈ కార్యక్రమాన్ని సమన్వ యం చేశారు. ప్రిన్సిపల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ సహా పలువురు సీనియర్ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ మౌలిక విలువల ప్రాముఖ్య తను ఈ కార్యక్రమం చాటిచెప్పింది. ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ, ప్రజాస్వామ్య సూత్రాలను గౌరవిస్తూ, దేశంపై తమ బాధ్యతలను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.