మహత్ కాలనీలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
అక్షర కిరణం, (విశాఖపట్నం): జీవీఎంసీ 61వ వార్డు పరిధిలోని మాధవధార ఏరియా మహత్ కాలనీలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగం అందించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను స్మరించుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్ర మంలో అధ్యక్షులుగా బొడ్డు వెంకటరమణ, కొత్తపల్లి కుమార్, తెలుగు దుర్గారావు వ్యవహరించగా, గౌరవ అధ్యక్షులుగా కాశి సుబ్బారెడ్డి, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. బీసీ నాయకులు ఎస్.పేరురాజు, శానిటరీ ఇన్స్పెక్టర్లు కాకినాడ బుచ్చిబాబు, ధనాల వెంకట్రావు, గౌరవ మహిళా అధ్యక్షురాలు ఎన్.ధర్మవతి తదితరులు పాల్గొన్నారు. పలువురు మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పిస్తూ ప్రజాస్వామ్యానికి బలమైన పునాదిగా నిలిచిందన్నారు. డాక్టర్ బీఆర్.అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని, ఆయన ఆశయాలైన సమానత్వం, విద్య, సామాజిక న్యాయం, సోదరభావాన్ని సమాజంలో ఆచరణలో పెట్టాలన్నారు. రాజ్యాంగం కేవలం ఒక గ్రంథం మాత్రమే కాదని, దేశంలోని ప్రతి పౌరుడి హక్కులకు, గౌరవానికి రక్షణ కల్పించే మార్గదర్శకమన్నారు. ఈకార్యక్రమం అంబేద్కర్ ఆశయాలను, రాజ్యాంగ స్ఫూర్తిని మరోసారి గుర్తుచేసింది.