కబ్జా అవుతున్న చెరువులను రక్షించాలి
మరిశర్ల కృష్ణమూర్తి నాయుడు
అక్షర కిరణం, (విజయనగరం ప్రతినిధి): విజయ నగరం జిల్లాలో కబ్జా అవుతున్న చెరువులను రక్షించాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఐ గోపాలరావు కోరారు. బుధవారం సమితి ఆధ్వర్యంలో చెరువులు పరిశీలించారు. సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరిశర్ల కృష్ణమూర్తి నాయుడు మాట్లాడుతూ జిల్లాలో కబ్జాలకు గురువుతున్న చెరువులను అధికారులు రక్షించాలని లేకపోతే భవిష్యత్తు తరాలకు తాగునీరు కూడా దొరకడం కష్టం అవుతుందన్నారు. ఉత్తరాంధ్ర చెరువులు పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఐ గోపాలరావు మాట్లా డుతూ పంచభూతాలను కాపాడవలిసిన అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని అన్నారు. పక్క రాష్ట్రములో నీటి వనరుల రక్షణ కోసం హైడ్రా లాంటి చట్టలు చేస్తుంటే మన నాయుకులు టీవీలు, పేపర్ ప్రకటనలకే పరిమితం అవుతున్నారని విమర్శించారు.