ప్రతి జర్నలిస్టుకు ఇళ్లు నిర్మించి ఇస్తాం
మంత్రి నారా లోకేష్ విశాఖలో లోకేష్‌ను కలిసిని పాత్రికేయులు
అక్షర కిరణం, (విశాఖపట్నం): జర్నలిస్టుల సమస్య లను పరిష్కరిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖ పర్యటనలో నారా లోకేష్‌ను జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. చిన్న పత్రికల సంఘం అధ్యక్షులు పి.సత్యనారాయణ, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ సభ్యులు రావులవలస రామ చంద్రరావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రమోహన్ ఆధ్వర్యంలో మంత్రి లోకేష్‌ను కలిశారు. జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు వివిధ అంశాలపై నారా లోకేష్‌తో చర్చించారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు జర్నలిస్టుల నుంచి దరఖాస్తులు స్వీకరించారని కానీ ఎన్నికల కోడ్ రావడంతో ఆ అంశం పెండిరగ్లో ఉండిపోయిందని చెప్పారు. అర్హులైన జర్నలిస్టు లకు ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చామని ఆ మేరకు త్వర లోనే కార్యాచరణ చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఇక జర్నలిస్టుల పెన్షన్ విషయంపై కూడా ఆయన చర్చించా రు. ఇతర రాష్ట్రాల్లో పెన్షన్ విధానం అమలులో ఉన్నప్పటికీ అక్కడ పరిమిత సంఖ్యలో జర్నలిస్టులు ఉన్నారని... ఏపీలో పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ఉన్న నేపథ్యంలో ఏమేరకు పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందో ఆలోచన చేస్తామన్నారు. మంత్రి నారా లోకేష్‌ను కలిసిన వారిలో జర్నలిస్ట్ సంఘ నాయకులు కీర్తన్, వేంపల్లి శ్రీధర్ తదితరులు వున్నారు.