మన ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ శ్రీకాకుళం జిల్లా కార్యవర్గం ఏర్పాటు
అక్షర కిరణం, (శ్రీకాకుళం): మన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు జేఎన్. రాజేంద్ర ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా శాఖ 2024-2025 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని పలాస చంద్రశేఖర ఆలయంలో ఎన్నుకోవడం జరిగిందని కుమార్ నాయక్ తెలిపారు. అధ్యక్షుడిగా డాక్టర్ కుమార్నాయక్, గౌరవాధ్యక్షుడిగా డాక్టర్ తెప్పల కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా డీఏ. స్టాలిన్, కోశాధికారిగా బమ్మిడి కృష్ణారావు, ఉపాధ్యక్షులుగా మడ్డు ఈశ్వరమ్మ, జాయింట్ సెక్రెటరీలుగా తోట సింహాచలం, సారక మోహన్రావు, సహయ కార్యదర్శులుగా రుక్మంగ ధరరావు, శోభారాణి, ఈసీ మెంబర్లుగా ఏడుగురు ఎంపిక య్యారని అధ్యక్షులు కుమార్నాయక్ తెలిపారు.