పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షకు కూటమి నాయకుల సంఫీుభావం
అక్షర కిరణం, (సాలూరు): తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ కల్తీవ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు సంఫీుభావంగా సాలూరు శ్రీకళ్యాణ వేెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద కూటమి నాయకులు బుధవారం సంఫీుభావ తెలిపారు. కూటమి నాయకులు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి లడ్డూ అపవిత్రం జరిగిందని గతప్రభుత్వ విధానాల వల్లే తిరుమల క్షేత్రానికి భక్తులకు హిందూ ధర్మానికి చాలా అన్యాయం జరిగిందన్నారు. చౌకధరకే లభించే నెయ్యిని రివర్స్ టెండరింగ్ విధానంలో వైసీపీ ప్రభుత్వం తీసుకో వడం వల్ల శ్రీవారి లడ్డూ మిగిలిన ప్రసాదాలలో కల్తీ జరగ డం దారుణమన్నారు. కూటమి నాయకులు కల్యాణ వేెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో సనాతన ట్రస్ట్‌బోర్డ్ ఏర్పాటుచేయాలని తెలిపారు. కార్యక్రమంలో జనసేన మండల నాయకులు రిషవర్ధన్, శివకృష్ణ, నవీన్‌కుమార్, జగదీశ్, సాలూరు టీడీపీ పట్టణ అధ్యక్షులు నిమ్మది తిరుపతి, నాయకులు గుల్ల వేణు పరమేష్, బీజేపీ నాయకులు అప్పలనాయుడు, విశ్వేశ్వరరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.