36, 37 వార్డుల్లో జెడ్సీ మల్లయ్య నాయుడు పర్యటన
అక్షర కిరణం, (వన్ టౌన్): దక్షిణ జోన్ జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్యనాయుడు సోమవారం దక్షిణ జోన్ పరిధిలోని 36వ, 37వ వార్డుల్లో గల చెంగల్రావుపేట, పైందోరిపేట, బీచ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. ఈసందర్భంగా జోనల్ కమిషనర్ మాట్లాడుతూ సీజనల్ గా వచ్చే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాల నివారణకు సంబంధిత సిబ్బంది పూర్తిస్థాయిలో సర్వేలెన్స్ నిర్వహించాలని, దోమల బ్రీడింగ్ ప్రదేశాలను గుర్తించి, వాటిని పూర్తిస్థాయిలో నిర్మూలించే చర్యలు చేప ట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతోపాటు, ఇళ్లపైభాగంలో ఉన్న నీటి ట్యాంకులు, ఇతర నీటి నిల్వ ప్రదేశాలను కూడా పరిశీ లించి, ఎక్కడా దోమల వృద్ధికి అనుకూలమైన పరిస్థితులు లేకుండా చూడాలని ఆదేశించారు. దోమల బ్రీడింగ్ ప్రదేశాలు గుర్తించిన వెంటనే వాటిని నిర్మూలించి, నిరం తరం పర్యవేక్షణ చేపట్టాలని శానిటరీ ఇన్స్పెక్టర్ రాంబాబు ను ఆదేశించారు. కాలువల్లో చెత్త వేయడం వల్ల పారిశుధ్య సమస్యలు తలెత్తడంతో పాటు దోమల వృద్ధికి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. అందువల్ల కాలువల్లో చెత్త వేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో శానిటరీ సూపర్ వైజర్ నీలిమ, శానిటరీ ఇన్స్పెక్టర్ శివ, మలేరియా శానిటరీ ఇన్స్పెక్టర్ రాంబాబు, హెల్త్ అసిస్టెంట్ కృష్ణ, శానిటేషన్ సెక్రటరీలు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.